Home » Entertainment » Ram Pothineni Huge Craze In Northside Compare To Allu Arjun
Entertainment

Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 27, 2024, 3:00 pm
Advertisement

Allu Arjun : బాలీవుడ్ లో అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి రామ్ మన దగ్గర కేవలం టైర్ 2 హీరో మాత్రమే కదా అతను ఎలా అల్లు అర్జున్ ని మించి వెళ్తాడని అనుకోవచ్చు. రామ్ నటించిన సినిమాలు తెలుగులో ఆడకపోయినా హిందీలో బాగా ఆడతాయి. అది కూడా యూట్యూబ్ లో రామ్ యాక్షన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. రామ్ సినిమా ఏదైనా వచ్చింది అంటే చాలు హిందీ లో డబ్ చేసి మరీ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు. రామ్ సినిమాలు బాలీవుడ్ యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే రామ్ కి అక్కడ పాపులారిటీ ఉంది. పుష్ప 1 తో సూపర్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ కన్నా రామ్ కే బాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉందని తెలుస్తుంది. ఈమధ్యనే రామ్ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లగా అక్కడ ఒక చిన్న ఊరిలో రామ్ ని గుర్తు పట్టి అక్కడ అభిమానులు అతనితో ఫోటోలు దిగారట.

Advertisement

రామ్ కూడా అక్కడి వారికి తాను తెలిసని నమ్మలేకపోయాడట. ఇలా చిన్న ఊళ్లలోకి కూడా రామ్ క్రేజ్ పాకింది. పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకుని జాతీయ అవార్డ్ అందుకున్నా సరే అల్లు అర్జున్ హిందీలో అందరికీ తెలియదు. అందుకే రామ్ డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా రిలీజ్ చేశాడు. పూరీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. రామ్ సినిమాలు యూట్యూబ్ లో కోట్ల కొద్దీ వ్యూస్ రాబడతాయి కాబట్టి అక్కడ భారీ హిట్ కొడుతుందని అనుకున్నా నిరాశపరచింది.

Allu Arjun : అవునా.. అక్క‌డ అల్లు అర్జున్ కన్నా రామ్ కే క్రేజ్ ఎక్కువా..?

Advertisement

రామ్ అల్లు అర్జున్ ఎవరి స్టైల్ వారిది. అల్లు అర్జున్ పుష్ప 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. అల్లు అర్జున్ కి తెలుగులో స్టార్ డం ఉండగా బాలీవుడ్ లో రామ్ తర్వాతే అల్లు అర్జున్ క్రేజ్ అన్నది కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి