
Rama Rajamouli : నాకు డైవర్స్ అయి బాబు ఉన్నా తనే నాకు ప్రపోజ్ చేశాడన్న రాజమౌళి భార్య
Rama Rajamouli : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి ఈ మద్య తనకి సంబంధించిన పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది.మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి, రాజమౌళి సన్నిహితులు పలువురు బోలెడు ఆసక్తికర విషయాలు తెలిపారు. రాజమౌళి భార్య రమాకి రాజమౌళి రెండో భర్త అని తెలిసిందే. రమాకి పెళ్లయి కార్తికేయ పుట్టిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె విడాకులు తీసుకోగా, ఆ తర్వాత రాజమౌళి, రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని తీయగా ఇందులో రమా తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడింది.
రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి మాట్లాడాడు. రమా మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటిసారి మా అక్క పెళ్లిలో చూసాను. నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదు. అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. రాజమౌళినే నాకు మొదట ప్రపోజ్ చేసాడు. నేను నో చెప్పాను. నాకు అప్పటికే విడాకులు అయి ఒక కొడుకు ఉన్నాడు. అయినా రాజమౌళి వదలకుండా ఒక సంవత్సరం పాటు పట్టుదలగా నా కోసం అలా ఉన్నాడు. దీంతో ఏడాది తర్వాత మేము ఇద్దరం కలిసి ప్రయాణించాలనుకున్నాం అని తెలిపింది. రమా రాజమౌళి తనయుడు కార్తికేయ మాట్లాడుతూ.. ఆయన నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా పరిచయం. చిన్నప్పుడు నన్ను, మా ఫ్యామిలీ కజిన్స్ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళేవాళ్ళు అని తెలిపాడు.
Rama Rajamouli : నాకు డైవర్స్ అయి బాబు ఉన్నా తనే నాకు ప్రపోజ్ చేశాడన్న రాజమౌళి భార్య
ఇక రాజమౌళి మాట్లాడుతూ.. మగధీర షూటింగ్ సమయంలో మాకు యాక్సిడెంట్ అయింది. మేము ఒక రిమోట్ ప్లేస్ లో డ్రైవ్ చేస్తూ వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. అందరికి గాయాలు అయ్యాయి. రమకి నడుము కింద స్పర్శ కూడా పోయింది. ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది అనుకున్నాము. దగ్గర్లో హాస్పిటల్ కూడా లేదు. తెల్సిన డాక్టర్స్ అందరికి ఫోన్స్ చేస్తూ నా భార్యని చూస్తూ ఏడ్చేసాను అని తెలిపారు. ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయినట్టు తెలిపారు రాజమౌళి. ఇక జక్కన్న ఇప్పుడు మహేష్ బాబు మూవీతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజులలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.