
ramya krishna as the next guest for balakrishna unstoppable 2
Unstoppable 2 : బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాబుల్ సీజన్ వన్ కు వచ్చిన క్రేజ్ తో రెండో సీజన్ ను కూడా వెంటనే ప్రారంభించారు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ ను ఏకంగా ప్రముఖ రాజకీయ నాయకులు చంద్రబాబు, లోకేశ్ తో తీశారు. రెండో ఎపిసోడ్ కు ఏకంగా డీజే టిల్లు సిద్దు, విశ్వక్సేన్ ను పిలిచారు. అయితే.. మూడో ఎపిసోడ్ కు ఎవరు రానున్నారు అంటూ చాలామందిలో ఆతృత మొదలైంది. నిజానికి రెండో ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు కానీ.. ప్రోమో మాత్రమే వచ్చింది.
అందుకే మూడో ఎపిసోడ్ కోసం బాలయ్య బాబు ఏకంగా అందమైన భామలను సిద్ధం చేశాడట. వాళ్లు ఎవరో కాదు.. ఒకరు సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ, మరొకరు అందాల రాశి ఖన్నా. ఇద్దరు ఇద్దరే. అయితే.. ఇంకా వీళ్ల షూటింగ్ స్టార్ కాలేదు. వీళ్లు షూటింగ్ రెండు మూడు రోజుల్లో జరుగుతుందట. కానీ.. ఇప్పటికే వీళ్లు మూడో ఎపిసోడ్ కు గెస్టులుగా వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బాలయ్య బాబుతో రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటించింది. ఈనేపథ్యంలో రమ్యకృష్ణ జీవితంలో చాలా చేదు ఘటనలు కూడా జరిగాయి. మరి.. రమ్యకృష్ణ కాంట్రవర్సీని బాలయ్య లేవనెత్తుతారా?
ramya krishna as the next guest for balakrishna unstoppable 2
అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తన భర్త కృష్ణవంశీతోనూ తనకు విభేదాలు ఉన్నట్టు ఆమధ్య వార్తలు వచ్చాయి. మరి.. ఇలాంటి నేపథ్యంలో రమ్యకృష్ణ చేదు ఘటనలను బాలయ్య తవ్వుతారా? అని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు రాశి ఖన్నా జీవితంలో ఏ విషయాలను బాలకృష్ణ అడుగుతారు. తను ఎవరితోనైనా డేటింగ్ లో ఉందా? లేదా? అనే విషయాలు ఇక ఈ షోతో ఎలాగూ తేలిపోనున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పడు ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు. ఆ అందమైన భామలతో బాలయ్య ఎలా ఆడుకుంటారో చూడాలి మరి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.