Home » Entertainment » Ramya Krishna Krishna Vamsi Divorce News Is Caused By Heroine Is There
Entertainment

Ramya Krishna : ర‌మ్య‌ కృష్ణ‌- కృష్ణ‌ వంశీ విడాకుల వార్త‌లకి కార‌ణం ఆ హీరోయినే కార‌ణ‌మా?

Authored By
Sam C
The Telugu News | Published on: July 18, 2022, 9:30 pm
Advertisement

Ramya Krishna: టాలీవుడ్‌లో క్యూట్ క‌పుల్‌గా పేరొందిన వారిలో కృష్ణ వంశీ- ర‌మ్య‌కృష్ణ జంట ఒక‌టి. అంద‌రి మాదిరిగానే ఈ జంట కూడా విడిపోబోతున్నారంటూ ఎన్నో పుకార్లు షికారు చేశాయి. కృష్ణవంశీ గతకొంతకాలంగా ఫామ్‌లో లేరు. ఆయన చేసిన చాలావరకు సినిమా ఫ్లాప్‌గా నిలిచాయి. ఈ క్ర‌మంలో ర‌మ్య‌కృష్ణ విడాకులు తీసుకోబోతుంద‌ని అప్ప‌ట్లో చాలా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఆయ‌న చేసిన రంగ‌మార్తాండ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా క్లారిటీ ఇచ్చారు. బాధ్యతలంటే భయంతో పెళ్లి వద్దనుకున్నా కాని రమ్యకృష్ణతో వివాహం జరిగిందని, ఇదంతా లైఫ్‌ డిజైన్‌ అని భావిస్తానని ఆయన అన్నారు. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు రాలేదని, రమ్యకృష్ణ తనను తనలా ఉండనిచ్చిందని బయటపెట్టారు.

Advertisement

ఇక విడాకుల వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చేశారు. పబ్లిక్‌ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయని, వాటిని తాము పెద్దగా పట్టించుకోమని చెప్పారు. వాటిని ఖండించాలని కూడా అనుకోరని, నవ్వి ఊరుకుంటారని క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ. అయితే అస‌లు పుకార్లు ఎలా వ‌చ్చాయంటే.. అప్పట్లో కృష్ణ వంశీ ఓ స్టార్ హీరోయిన్ ఛార్మి తో చాలా చనువుగా ఉంటున్నాడని..అందుకే రమ్య విడాకులు ఇవ్వాలి అనుకుందని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే..అప్పుడు రమ్య చెన్నైలో ఉండేది..

Ramya Krishna-Krishna Vamsi Divorce News Is Caused By heroine is there

Advertisement

Ramya Krishna : ఆమె కార‌ణమా?

కృష్ణ వంశీ హైదరబాద్ లో ఉండేవాడు. సో..అలా గ్యాప్ రావడంతో ఇద్దరి మధ్యలోకి దూరింది ఛార్మి..అని పుకార్లు వైరల్ అయ్యింది. కాని ఇంత‌వ‌ర‌కు ఆ వార్త‌ల‌ని ఖండించ‌ని కృష్ణ వంశీ మాత్రం ఇప్పుడు స్పందించాల్సి వ‌చ్చింది. కాగా, పెళ్ళికి ముందు రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో చంద్ర‌లేఖ సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య ప్రేమ పెళ్లికి దారితీసింది. నాగార్జున హీరోగా వచ్చిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. ఆ టైంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకుని..ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి