Home » Entertainment » Rashi Khanna Latest Bold Pic
Entertainment

Rashi Khanna : సైడ్ యాంగిల్‌లో అందాల విందు… మంటపెట్టిన రాశీ ఖన్నా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 8, 2021, 7:06 am
Advertisement

Rashi Khanna : రాశీ ఖన్నా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన పీక్స్‌లో ఉంటుంది. పద్దతిగా చీరకట్టులో కనిపించినా, మోడ్రస్ దుస్తుల్లో మెరిసినా కూడా రాశీ ఖన్నా అందాలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండే రాశీ ఖన్నా ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. మల్లెతీగలా జీరో సైజులోకి మారేందుకు ఏడాదికిపైగా కష్టపడ్డట్టు చెప్పుకొచ్చింది. ఒక్కసారిగా అలా బికినీలో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక అందాలను ఆరబోయడంతో రాశీ ఖన్నా తన జోరును కొనసాగిస్తోంది.

Advertisement

Rashi Khanna Latest Bold Pic

బికినీలోకి శరీరాకృతిని మార్చుకునేందుకు ఎంత కష్టపడ్డదో, ఫుడ్ విషయంలో ఎంత కంట్రోల్ చేసుకుందో వివరించింది. అలా సన్నగా మారిపోయిన రాశీ ఖన్నా ఫోటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. వెరైటీ వెరైటీ ఫోటో షూట్లతో అందరినీ కట్టిపడేస్తోంది. లాక్డౌన్ సమయంలో రాశీ ఖన్నా ఫోటో షూట్లతోనే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ వచ్చింది. అయితే తాజాగా రాశీ ఖన్నా తన అందాలను సైడ్ యాంగిల్‌లోంచి ప్రదర్శించింది. బంగారు వర్ణంలా మెరిసిపోతోన్న రాశీ ఖన్నా ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

Rashi Khanna Latest Bold Pic

రాశీ ఖన్నా తన వీపు భాగం, ఎద భాగం కనిపించేలా షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట్లో మంట పెడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రాజెక్ట్‌లను చేస్తూ బిజీగా ఉంది. ఇక కోలీవుడ్‌లో అయితే ఏకంగా విజయ్ సేతుపతితో వరుసగా రెండు ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది. తెలుగులో గోపీచంద్, మారుతి కాంబోలో రాబోతోన్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి