Home » Entertainment » Rashi Khanna New Pics Viral
Entertainment

Raashi khanna : అందాల ‘రాశి’.. సొగసు చూడతరమా.. పిక్స్ వైరల్!

Authored By
mallesh
The Telugu News | Published on: October 16, 2021, 4:35 pm
Advertisement

Raashi khanna : ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంటుంది.. పాత నీరు వెళ్లిపోతుంటుంది. కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌ అందరినీ అదృష్టం వరించదు. అది కొందరికి మాత్రమే సొంతం. కొందరు రాగానే ఒకటి రెండు సినిమాల్లో కనిపించి మాయమై పోతుంటారు. మరికొందరు మాత్రం హిట్స్‌తో పనిలేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంటుంటారు. వరుస ఆఫర్లు రావాలన్నా.. మంచి హిట్ సినిమాల జాబితాలో తమ పేరు నిలవాలన్నా దానికి అందం ఒక్కటే సరిపోదు. అభినయం కూడా కావాలి. ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వొమ్ము చేయకూడదు. పైవన్నీ అర్హతలు ఉన్న వారిలో అందాల రాశికన్నా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.

Advertisement

Rashi Khanna new pics viral

రాశికన్నాకు ఇటీవల ఆఫర్లు కాస్త తగ్గిన విషయం తెలిసిందే. కారణం ఏమైనా కావొచ్చు. కానీ అందాల బొమ్మ ఏ మాత్రం జంకడం లేదు. ఈ అందాల రాశి పుట్టి పెరిగింది ఢిల్లీలో అయినా, చదువు అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2013లో తొలి చిత్రం బాలీవుడ్‌లో మద్రాస్ కేఫ్‌ మూవీలో జాన్ అబ్రహం సరసన నటించింది. ఆ తర్వాత 2014లో ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగు ఇండ్రస్టీకి పరిచయం అయ్యింది. తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ బుట్టబొమ్మకు వరుస ఆఫర్లు తలుపుతట్టాయి.

Advertisement

Raashi khanna : రాశికి హిట్స్‌తో సంబంధం లేదు..

Rashi Khanna new pics viral

తొలిప్రేమ, జై లవకుశ, బెంగాల్ టైగర్, సుప్రీం, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలతో రాశికి మంచి పేరు వచ్చింది. సాయిధరమ్ తేజ్‌తో నటించినా మూవీలో ‘ఏంజెల్ ఆర్నా’ టిక్‌టాక్ స్టార్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. తాజాగా అందాల రాశి తన అందాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది. బ్లూ జీన్స్, డిఫరెంట్ కాస్టూమ్స్‌తో పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది. ఒకప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉన్న రాశి కన్నా ఇటీవల స్లిమ్‌గా మారింది. తన లేటెస్ట్ ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కుర్రకారు రాశి అందాలకు ఫిదా అయిపోతున్నారట.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి