Rashi Khanna Thing with a thyroid problem
Rashi Khanna : సినిమా ఇండస్ట్రీలో అలాగే అభిమానులు బబ్లీ బ్యూటీ అని పిలుచుకుంటున్న రాశీ ఖన్నా వాస్తవంగా తాను సినిమాలలోకి రాకముందు అలా ఉండేది కాదట. చాలా సన్నగానే ఉండేదట. కానీ, సినిమాలలో నటించడం మొదలుపెట్టాకే లావెక్కినట్టు, అందరూ ఈ విషయంలో తనకు సలహాలిచ్చి సన్నబడమని కూడా చెప్పినట్టు తెలిపింది. అయితే సన్నబడాలనే పట్టుదలతో రెండేళ్ళు జిం లో కసరత్తులు చేస్తూ ఉండిపోయింది గానీ, తనకు ఉన్న అసలు సమస్య ఏంటో తెలుసుకోలేకపోయింది. తీరా తెలుసుకున్న తర్వాత షాక్‌కు గురైనట్టు చెప్పుకొచ్చింది.
రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలో హీరోగా గోపీచంద్ నటించాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో జిల్ అనే సినిమా వచ్చి హిట్ సాధించింది. మళ్ళీ ఇంతకాలానికి గోపీచంద్ – రాశీ ఖన్నా కాంబినేషన్ రిపీటవుతోంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో రాశీ ఖన్నా ప్రతిరోజూ పండగే సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత మళ్ళీ రాశీ సినిమా ఏదీ తెలుగులో రిలీజ్ కాలేదు. కాగా, ఈ సినిమా మరికొన్ని గంటల్లో భారీ స్థాయిలో థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో రాశీ ఖన్నా మాట్లాడుతూ..హీరోయిన్‌గా మారాక బరువెక్కడం మొదలైందని చెప్పుకొచ్చింది.
Rashi Khanna Thing with a thyroid problem
చూస్తుండగానే బాగా లావయ్యానని తెలిపిన రాశీ ఇలా ఉంటే హీరోయిన్‌గా అవకాశాలు రావని అందరూ చెప్పడంతో రోజూ జిం లో గంటల కొద్దీ వ్యాయామం చేశాను అని చెప్పింది. అయితే, ఇలా రెండేళ్ళు
వ్యాయామం చేసి పర్ఫెక్ట్‌గా డైట్ ఫాలో అయినా కూడా బరువు తగ్గడంలో ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో అప్పుడు డాక్టర్ను సంప్రదించానని వెల్లడించింది. అప్పుడే తనకు థైరాయిడ్ సమస్య ఉన్న విషయం తెలిసినట్టు పేర్కొన్నది. ఈ సమస్య ఉందని తెలిసి షాకైనట్టు చెప్పుకొచ్చిన రాశీ
ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాక ఆ సమస్య నుంచి కొంతవరకు బయటపడినట్టు తెలిపింది. ఇక నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా థాంక్యూ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.