Home » Entertainment » Rashmi Gautam Emotional Post In Viral
Entertainment

Rashmi Gautham : నిన్ను ఎప్ప‌టికి వ‌ద‌ల‌ను.. వారిని చాలా కౌగిలించుకోవ‌డం చాలా ఇష్టం అంటూ ర‌ష్మీ ఎమోష‌న‌ల్ పోస్ట్

Authored By
Sam C
The Telugu News | Published on: February 3, 2022, 11:00 am
Advertisement

Rashmi Gautham : అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ గౌత‌మ్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఈ ముద్దుగుమ్మ చేసే సంద‌డి ప్ర‌తి ఒక్క‌రిని మంచి వినోదంతో పాటు ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. ర‌ష్మీ బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై అల‌రిస్తూ ఉండ‌డంతో పాటు ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో ప‌లు విష‌యాల‌పై స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా బెంగ‌ళూరులోని ఓ అపార్మెంట్ లోని ఓ యువకుడు తన ఆడి కారును నడుపుతూ పడుకున్న కుక్క మీద నుంచి తీసుకెళ్లాడు. దీంతో ఆ కుక్క చనిపోయినట్లుగా తెలుస్తోంది.. అయితే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై ఘాటుగా స్పందించిన ర‌ష్మీ.. డబ్బుతో వస్తువులను కొనొచ్చు.. కానీ బుద్దిని, పద్దతిని కొనలేం.

Advertisement

కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. కుక్కను రాళ్లతో కొట్టడం అనేది సరదా విషయం అని పిల్లలకు నేర్పించకండి.. వాళ్లే భవిష్యత్తులో ఇలా తయారవుతారు అంటూ చెప్పుకొచ్చింది రష్మీ.మొద‌టి నుండి మూగ‌జీవాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌పిస్తూ ఉండే ర‌ష్మీ గౌత‌మ్.. ఎవ్వరైనా వీధి కుక్కలు, మూగ జీవాలకు హాని తలపెడితే అస్సలు సహించదు. సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ ఫైర్ కావడం చాలాసార్లు చూశాం. తాజాగా మూగ జీవాల‌పై ఆమె చూపిస్తున్న ప్రేమ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. త‌న పెట్ ని కౌగిలించుకున్న ఈ ముద్దుగుమ్మ‌…జీవితాంతం నిన్న అట్టిపెట్టుకుంటా.అస్స‌లు వ‌ద‌ల‌ను.

rashmi gautam emotional post in viral

Advertisement

Rashmi Gautham : మూగ జీవాలంటే అంత ఇష్ట‌మా…

లవ్ మై బేబీస్. నా పిల్లలను కౌగిలించుకోవడం చాలా ఇష్టం అని రాసుకొచ్చింది.ఈ పోస్ట్‌‌పై సీనియర్ హీరోయిన్ ప్రియమణి స్పందిస్తూ..’ఆ ఫేస్ చూడు’ అంటూ రష్మీ లవ్ యాంగిల్ తెలిసేలా కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో పాటు రష్మీ జంతు ప్రేమపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బుల్లితెరపై ‘జబర్దస్త్’ షో యాంకర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. అటు జబర్దస్త్‌తో పాటు ఢీ తదితర షోల్లో సందడి చేస్తూనే అడపాదడపా సినిమాల్లోనూ మెరుస్తోంది. అందచందాలతో పాటు ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ సినిమాలో నటించనుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి