Rashmi Gautam : సుధీర్ రష్మీ కెమిస్ట్రీ బుల్లితెరపై ఎలా ఉన్నా బయట మాత్రం మామూలు ఫ్రెండ్స్‌లానే ఉంటారు. తెరపై ఏదో అమర ప్రేమికులు, చిరకాల ప్రేమికులన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం అక్కడ అంత ఉండదు. సుధీర్, రష్మీలు తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని ఎన్ని సార్లు చెప్పినా కూడా అభిమానులు మాత్రం వినరు. తెరపై వారు చేసే మ్యాజిక్‌కు పడిపోతుంటారు. రష్మీ సుధీర్ జంటగా కనిపిస్తే చాలు ఆ షో లేదా ఆ ఈవెంట్ హిట్టన్న మాటే. అంతలా ఆ జోడికి క్రేజ్ వచ్చేసింది.
అయితే గత కొంతా కాలం నుంచి ఈ ఇద్దరూ కలిసి ఈవెంట్లు గానీ, షోలకు హోస్టింగ్ గానీ చేయడం లేదు. ఒకరు కనిపిస్తే ఇంకొకరు కనిపించడం.. ఒకరు వెళ్లిపోతే ఆ తరువాత మెల్లిగా వాళ్ల స్థానంలోకి వచ్చేస్తున్నారు. మామూలుగా అయితే ఈ జోడి ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షోల్లో తెగ సందడి చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆ సందడంతా మాయమైంది. సుధీర్ అయితే ఈ ఢీ పద్నాలుగో సీజన్ నుంచి రావడం లేదు. సుధీర్ లేకపోవడంతో ఆ షో దారుణమైన స్థితిలోకి వెళ్లింది. రష్మీ, ఆది, ప్రదీప్ ఇలా ఎంత ప్రయత్నించినా ఆ షోకు రేటింగ్స్ రావడం లేదు. మొత్తానికి ఆ షో నుంచి రష్మీ కూడా బయటకు వచ్చింది.
ఇక ఆ తరువాత సుధీర్ కొన్ని రోజులకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోనూ కనిపించడం మానేశాడు. దీంతో అక్కడ కూడా వీరిద్దరినీ చూసే చాన్స్ లేకుండా పోయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి గెటప్ శ్రీను, సుధీర్ ఇద్దరూ దూరంగానే వెళ్లిపోయారు. తమ తమ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే వెళ్లిపోయారంటూ తెలుస్తోంది. అయితే ఇప్పుడు సుధీర్ మాత్రం శ్రీదేవీ డ్రామా కంపెనీ నుంచి కూడా బయటకు వచ్చేశాడు. అతని స్థానంలో రష్మీ యాంకరింగ్ చేస్తోంది. దీనిపై ఆది, రాం ప్రసాద్‌లు సెటైర్లు వేశారు.
రష్మీతో చేసే.. కామెడీ షో నుంచి పాటల ప్రోగ్రాంకు హోస్ట్‌గా వెళ్లాల్సి వచ్చిందని సుధీర్ మీద పరోక్షంగా పంచులు వేస్తారు. నేను ముందు చేస్తాను.. ఆ తరువాత నువ్ చేయ్.. అని ఇద్దరూ ఈ షో యాంకరింగ్ గురించి ముందే మాట్లాడుకున్నారు కదా? అని లేనిపోని కొత్త అనుమానాలను క్రియేట్ చేశారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.