Home » Entertainment » Rashmi Gautam Latest Video Viral
Entertainment

Rashmi Gautham : జ‌బ్బలు క‌నిపించేలా జాకెట్ ధ‌రించి అందాల ర‌చ్చ చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్

Authored By
Sam C
The Telugu News | Published on: May 25, 2022, 6:30 pm
Advertisement

Rashmi Gautham : తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ర‌ష్మీ గౌత‌మ్. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మ‌డి కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు.ఈ సినిమా త‌ర్వాత కూడా ర‌ష్మీ ప‌లు సినిమాల‌లో న‌టించిన పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి.

Advertisement

తాజాగా ఈ అమ్మ‌డు భోళా శంక‌ర్ చిత్రంలో న‌టిస్తుంద‌ని స‌మాచారం.రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. రష్మీ క్రేజ్ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేస్తుందని అందరూ భావించారు. అయితే బుల్లితెర కలిసొచ్చినంతగా ఆమెకు వెండితెర కలిసి రావడం లేదు. హీరోయిన్ గా పలు ఆఫర్స్ దక్కినా, హిట్ అనేది దక్కలేదు. దీనితో ఆమెకు చిన్నగా అక్కడ ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. ప్ర‌స్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.

rashmi gautam latest Video Viral

Advertisement

Rashmi Gautham : ర‌ష్మీ అందాల హంగామా..

అన్ని కార్యక్రమాలు పూర్తి కాగా, చాలా కాలంగా ఈ చిత్రం బాక్సులకే పరిమితం చేస్తున్నారు.కాగా రష్మీని ఢీ సీజన్ 14 నుండి తొలగించారు. అలాగే సుడిగాలి సుధీర్, జడ్జి పూర్ణ, దీపికా పిల్లిని సైతం తొలగించడం జరిగింది. ఇక వెండితెరపై కూడా రష్మీ హవా తగ్గింది. ఆమెకు గతంలో హీరోయిన్ వరుస ఆఫర్స్ దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కనీసం ఐటెం సాంగ్స్ చేసే ఛాన్స్ కూడా రావడం లేదు. ఏది ఎలా ఉన్నా కూడా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కనిపించేలా 360 కోణంలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. హాట్ యాంకర్ బోల్డ్ ఫోజులకు జనాల మైండ్ బ్లాక్ అవుతుంది. డీప్ నెక్ జాకెట్, డిజైనర్ శారీ ధరించిన రష్మీ గౌతమ్ సరికొత్తగా అందాలు ఆవిష్కరించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి