
rashmika mandanna another morphing video viral
Rashmika Mandanna : మొన్ననే కదా.. రష్మిక మందన్నా ముఖంతో ఓ వీడియోను వైరల్ చేశారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో రష్మిక మందన్నా ముఖాన్ని వేరే యువతి శరీరానికి తగిలించారు. అది కొంచెం అసభ్యకరంగా ఉన్న వీడియో. దీంతో ఆ వీడియోలో ఉన్నది నిజంగానే రష్మిక అనుకొని రష్మికపై ఫైర్ అయ్యారు. నువ్వేంటి.. నీ డ్రెస్ ఏంటి.. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఈ బుద్ధి ఏంటి అంటూ మండిపడ్డారు. కానీ.. అసలు ఆ వీడియోలో ఉన్నది రష్మికనే కాదు. ఆ తర్వాత తెలిసింది అందులో ఉన్నది రష్మిక కాదని.. ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని. ఏది ఏమైనా మార్ఫింగ్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలే ఈ మార్ఫింగ్ దాడికి గురవుతున్నారు. తాజాగా రష్మికకు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. అది కూడా మార్ఫింగ్ వీడియోనే. ఎంత చెప్పినా ఈ సైబర్ నేరగాళ్లు మాత్రం అస్సలు ఆపడం లేదు. రెచ్చిపోతూనే ఉన్నారు. మరో వీడియో వైరల్ కావడంతో తన ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ నివ్వెర పోతోంది.
నిజానికి తన ఫస్ట్ మార్ఫింగ్ వీడియో బయటికి వచ్చినప్పుడే చాలామంది తనకు మద్దతు ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు కూడా రష్మికకు మద్దతు ఇచ్చారు. డీప్ ఫేక్ టెక్నాలజీపై చాలామంది పలు రకాలుగా చర్చిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మళ్లీ రష్మిక వీడియో రావడం సంచలనం సృష్టిస్తోంది. సైబర్ క్రిమినల్స్ ఎందుకు రష్మికనే టార్గెట్ చేస్తున్నారు అనేది అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా తనను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేయడంపై రష్మిక కూడా స్పందించింది. ఆమె కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై మద్దతు తెలిపారు. రాజకీయ ప్రముఖులు కూడా పబ్లిక్ వేదికలపై మద్దతు తెలిపారు.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేసినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం తను పుష్ప 2 సినిమాతో పాటు రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న యానిమల్ మూవీలో నటిస్తోంది. తన భవిష్యత్తు ప్రాజెక్టులపై ఇంకా రష్మిక అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఏది ఏమైనా రష్మిక మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నా.. అవి ఫేక్ అని తన అభిమానులు గుర్తుపట్టేసి రష్మికకు తోడుగా నిలుస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.