Rashmika Mandanna comments about that hero
Rashmika Mandanna : టాలీవుడ్ లో ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది రష్మిక మందన. ఇక రష్మిక ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అయితే రీసెంట్గా తన అభిమానులు అడుగుతున్న ప్రశ్నకి క్లారిటీ ఇచ్చింది. తన చేతిపై ఉన్న టాటూ కి వేసుకున్న దానికి అర్థం ఏంటో క్లారిటీ ఇస్తూ
సంచలన కామెంట్స్ చేసింది. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమా తెలుగులో విడుదల అయింది. ఈ సినిమా రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక తన చేతిపై రాసి ఉన్న టాటూ గురించి చెప్పుకొచ్చింది. తాను కాలేజీ చదివే టైంలో ఓ అబ్బాయి తన దగ్గరకు వచ్చి అమ్మాయిలు సూదులతో గుచ్చితే తట్టుకోలేరని ఆ నొప్పిని అమ్మాయిలు భరించలేరని హేళనగా మాట్లాడారు. అదే టైంలో అమ్మాయిలు ఏదైనా చేయగలరు అని నిరూపించడానికి నేను టాటూ వేయించుకోవడానికి డిసైడ్ అయ్యాను.
Rashmika Mandanna comments about that hero
అయితే ఏ టాటూ వేయించుకోవాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాను అప్పుడే నాకు అర్థమైంది మనల్ని మన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ మనిషిలోని టాలెంట్ని వేరే వాళ్ళు ఎవరు మార్చలేరు. ఆ కారణంగానే టాటూ వేయించుకున్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో రష్మిక చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ విషయంపై అటు విజయ్ కాని ఇటు రష్మిక కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు ఇది నిజమని అనుకుంటున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.