Home » Entertainment » Rashmika Mandanna Ex Boyfriend Viral Comments
Entertainment

Rashmika Mandanna : మేము టచ్ లోనే ఉన్నాం.. మరోసారి రష్మిక మందన్నా మాజీ ప్రియుడి కామెంట్స్ వైరల్..!

Authored By
aruna
The Telugu News | Published on: February 17, 2024, 9:30 pm
Advertisement

Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. నాగ శౌర్య నటించిన ‘ ఛలో ‘ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకున్నారు. గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస హిట్ సినిమాలలో నటించారు. ఇక పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రేజ్ తోనే రష్మిక బాలీవుడ్ లోను అవకాశాలు అందుకుంటుంది. ఇప్పటికే అక్కడ రెండు మూడు భారీ సినిమాలు చేశారు. రష్మిక మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు చేసింది అవి అంతగా ఆకట్టుకోలేదు.

Advertisement

ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘ యానిమల్ ‘ సినిమా భారీ హిట్ ను సంపాదించుకుంటే రష్మిక నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెకు హిందీలో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. దీంతోపాటు రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నారు. ఇక తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రిలేషన్ షిప్ లో ఉన్న రష్మిక కన్నడలో సినిమాలు చేసే సమయంలో హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి వరకు వెళ్ళింది. కానీ అనుకోని కారణాలతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో తన డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె గతంలో వెల్లడించారు.

ఆ తర్వాత ఆమె అనుకున్నట్టుగానే స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆ తర్వాత ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రిలేషన్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు కన్నడ హీరో రక్షిత్ శెట్టి కూడా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే తాజాగా రక్షిత్ శెట్టి రష్మిక తో పెళ్లి క్యాన్సిల్ అవ్వడంపై మరోసారి స్పందించారు. మా పెళ్లి ఆగిపోయింది. అయినా ఏమైంది. మేము ఇప్పటికీ టచ్ లో ఉన్నాం. ఆమెకు లైఫ్ లో పెద్ద డ్రీమ్ ఉంది. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించింది. ఆ విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రక్షిత్ శెట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఏంటి ఇంకా వీరిద్దరూ టచ్ లోనే ఉన్నారా అని నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి