Home » Entertainment » Rashmika Mandanna Is On Pushpa Set
Entertainment

Rashmika Mandanna : ‘పుష్ఫ’లోకి రష్మిక.. లోడింగ్ అంటూ పోస్ట్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: February 24, 2021, 11:44 am
Advertisement

Rashmika Mandanna : స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందాన్న హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఇంత వరకు రష్మికకు సంబంధించిన సీన్స్ మాత్రం తెరకెక్కించలేదు. తాజాగా రష్మిక మందాన్న కూడా పుష్ప యూనిట్‌తో సందడిచేసేందుకు రెడీ అయింద. ఇన్ని రోజులు తన శరీరాకృతిని మార్చుకునే పనిలో పడింది. వ్యాయామాలు చేస్తూ ఎంతో శ్రమించింది. అలా రష్మిక ఇప్పుడు పుష్ప సినిమా కోసం రెడీ అవుతోంది.

Advertisement

Rashmika Mandanna Is On Pushpa Set

ఇప్పుడు పుష్ప యూనిట్ తమిళనాడులో ఉంది. పాట చిత్రీకరణలో భాగంగా అందరూ తమిళనాడుకు బయల్దేరారు. ఈ విషయాన్ని జానీ మాస్టర్ పోస్ట్ చేశాడు. పుష్ప సాంగ్ షూటింగ్ గురించి తమిళనాడుకు వెళ్తున్నాను అంటూ ప్రకటించాడు. అలా పుష్ప షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా రష్మిక మందాన్న కూడా పుష్ప షూట్‌లో జాయిన్ అయ్యేందుకు వెళ్తోంది. ఈ మేరకు ఆమె కూడా ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక పుష్ప సెట్‌లో అడుగుపెట్టేసింది.

Advertisement

Rashmika Mandanna : ‘పుష్ఫ’లోకి రష్మిక..

పుష్ప కోసం షూటింగ్‌కు వెళ్తుంటే ఇలా క్రేజీగా ఉంటానని ఓ పోస్ట్ చేసింది. ఇందులో రష్మిక మందాన్న చిన్న పిల్లలాకనిపించింది. లోడింగ్ అంటూ రష్మిక అసలు విషయం చెప్పేసింది. ఇక రష్మిక ఇప్పుడు ఇది కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. రష్మిక సిద్దార్థ్ మల్హోత్ర కాంబోలో ఓ మూవీ, కార్తీతో సుల్తాన్ మూవీ, తెలుగులో శర్వానంద్‌తో కలిసి ఆడాళ్లూ మీకు జోహార్లు అని ఇలా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి