rashmika mandanna is ready for doing a special song Samantha
Rashmika Mandanna : పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ పార్ట్ వన్ ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సినిమాలో బన్నీ సరసన క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన నటించింది. ఈ భామ ప్రజెంట్ ‘పుష్ప’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూనే పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ అమ్మడు.‘పుష్ప’ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మందన తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలన్నిటికీ రష్మిక సమాధానాలిచ్చింది.
‘పుష్ప’లో సమంత చేసిన మాదిరిగా రష్మిక కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందా అనే ప్రశ్నకు రష్మిక సమాధానం ఇచ్చింది. తాను కూడా చేయొచ్చు కదా అని అంది. అయితే, తాను స్పెషల్ సాంగ్ చేస్తే చూస్తారా? అని విలేకరులను రష్మిక సరదాగా ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సమంత స్పెషల్ సాంగ్‌లో స్టన్నింగ్ లుక్స్‌లో కనబడిందని, సమంత స్పెషల్ సాంగ్ చేయబోతున్నదని తెలుసుకుని ఆనందం వ్యక్తం చేశానని అంది రష్మిక.తను చేసిన మాస్ సాంగ్ ‘సామి సామి’ అని రష్మిక ఈ సందర్భంగా తెలిపింది. ఇకపోతే తను చేయబోయే సినిమాల్లో ఇటువంటి మాస్ సాంగ్స్ ఉంటాయని ఆశిస్తున్నానని చెప్పింది రష్మిక.
rashmika mandanna is ready for doing a special song Samantha
‘పుష్ప’సినిమాలో రష్మిక మందన పల్లెటూరు యువతి ‘శ్రీవల్లి’గా కనిపించనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’. గతంలో వీరిరువురి కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు వచ్చాయి. నేషనల్ క్రష్ రష్మిక .. ఇప్పటికే కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది ఈ భామ. ‘మిషన్ మజ్ను, గుబ్ బై’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది రష్మిక మందన. ఈ చిత్రాలతో పాటు తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పిక్చర్‌లో నటిస్తోంది. ఇందులో హీరోగా శర్వానంద్ నటిస్తున్నారు.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.