
Rashmika mandanna : రష్మిక మందన్న .. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ ని ఏలుతోంది. ఛలో అన్న చిన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై రష్మిక మందన వరసగా స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది. కెరీర్ లో ఇంత త్వరగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి జంటగా నటించే ఛాన్స్ అందుకుంటుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. గత ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు .. నితిన్ తో భీష్మ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. దాంతో రష్మిక క్రేజ్ టాలీవుడ్ లో విపరీతంగా పెరిగిపోయింది. చెప్పాలంటే టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మందన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
rashmika-mandanna-latest-music-video-top-tucker-is-an-amazing-one
ఈ క్రేజ్ వల్ల ఇప్పుడు రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే యంగ్ హీరో సిద్దార్థ్ మల్‌హోత్రా కి జంటగా మిషన్ మజ్ఞు అన్న సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కి కూతురుగా ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలీవుడ్ లో కూడా రష్మిక మందన స్టార్ హీరోయిన్ గా సెటిలైనట్టే. అంతేకాదు అక్కడ కియారా అద్వానీ.. పూజా హెగ్డేలకి గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ తో చేసే సినిమా బాలీవుడ్ లో రష్మిక కి బాగా ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు.
కాగా రష్మిక కి కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. అక్కడ సినిమాలు కమిటవుతోంది. అంతేకాదు మధ్యలో క్రేజీ వీడియో ఆల్బంస్ లో చేయడానికి సై అంటోంది. కొత్తగా టాప్ టక్కర్ అన్న వీడియో ఆల్బం చేసింది రష్మిక. ఫుల్ ఫంకీ గా ఉన్న ఈ ఆల్బం తో రష్మిక క్రేజ్ మరోలా కూడా పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు పాపులర్ సింగర్ అద్నాన్ సమీ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా లాంటి వాళ్ళ నుంచి ఖచ్చితంగా వీడియో సాంగ్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంటుందని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి రీసెంట్ గా రిలీజైన టాప్ టక్కర్ టీజర్ లో రష్మిక రచ్చ మామూలుగా లేదు. ఇలాంటి మ్యూజిక్ ఆల్బం లో చేస్తే వచ్చే క్రేజ్ కూడా సినిమా రేంజ్ లో ఉంటుంది. అందుకే రష్మిక ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోలేదట.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.