Home » Entertainment » Rashmika Mandanna Serious Workouts
Entertainment

Rashmika Mandanna : జిమ్‌లో తెగ క‌స‌ర‌త్తులు చేస్తున్న ర‌ష్మిక మంద‌న్నా.. అమ్మ‌డి క‌ష్టం మాములుగా లేదు..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 14, 2022, 6:00 pm
Advertisement

Rashmika: అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్నా క్రేజ్ ఇటీవ‌లి కాలంలో చాలా పెరిగింది. పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం రష్మిక సీరియస్ గా ట్రై చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో టాలీవుడ్ లో లీడింగ్ లేడీగా మారింది రష్మిక. త్వరలో పుష్ప2లో నటించబోతోంది. కోలీవుడ్ పై కూడా రష్మిక సీరియస్ గా ఫోకస్ పెట్టింది. బీస్ట్ హీరో విజయ్ తో కలసి కొత్త చిత్రంలో నటించబోతోంది. విజయ్ నటిస్తున్న ఈ తెలుగు,తమిళ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. రష్మిక మందనకు తమిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే మహా అభిమానం. విజయ్‌ అంటే క్రష్‌..

Advertisement

అతనితో ఒక్క సినిమా చేసినా చాలంటూ గతంలో రష్మిక చాలా సార్లు ఓపెన్‌గా మాట్లాడింది.అయితే అంచెలంచెలుగా రష్మిక క్రేజ్ పెరగడంతో ఆమెకు విజయ్‌ సరసన నటించే అవకాశం దక్కింది. వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న కొత్త సినిమాలో విజయ్‌తో కలిసి నటిస్తోంది రష్మిక. కోలీవుడ్ లో టాప్ ఫామ్ లో ఉన్న విజయ్ తో మూవీ ఛాన్స్ అంటే తమిళ సినీ పరిశ్రమలో రష్మికకు ఇన్ స్టెంట్ గా స్టార్ డమ్ కన్ ఫామ్ అన్నట్లే లెక్క. హిందీలోనూ రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది. అమితాబ్ తో కలసి గుడ్ బై, సిద్ధార్ద్ మల్హోత్రా జతగా మిషన్ మజ్ను చిత్రాల్లో కనిపించనుంది

Rashmika Mandanna serious workouts

Advertisement

Rashmika Mandanna : ర‌ష్మిక క‌ష్టం మాములుగా లేదు..

. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రానున్నాయి.పుష్పతో ఆల్రెడీ బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరైంది రష్మిక. ఈ రెండు స్ట్రెయిట్ హిందీ మూవీస్ కూడా వర్క్ అవుట్ అయితే మాత్రం నేషన్ క్రష్‌ అక్కడ మామూలుగా ఉండదు. అయితే ఈ అమ్మ‌డు త‌న ఫిట్ నెస్ లెవ‌ల్ పెంచుకునేందుకు నిత్యం క‌స‌ర‌త్తులు చేస్తుంది. ఈ అమ్మ‌డు చేసే వ‌ర్క‌వుట్స్ అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక‌కు సంబంధించిన వ‌ర్కవుట్ వీడియో వైర‌ల్‌గా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి