Home » Entertainment » Rashmika Mandanna Shares Interesting Video
Entertainment

Rashmika Mandanna : ఫుల్ జోష్‌లో క‌నిపిస్తున్న రష్మికా మందన్న.. ఇంత ఆనందానికి కార‌ణం ఏంటి?

Authored By
Sam C
The Telugu News | Published on: February 24, 2022, 11:00 am
Advertisement

Rashmika Mandanna : అందాల ముద్దుగుమ్మ రష్మికా మందన్న ఈ మ‌ధ్య తెగ వార్త‌ల‌లోనిలుస్తుంది. ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌, పెళ్లి అంటూ ఇటీవ‌ల తెగ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. కొంతకాలంగా రష్మిక…విజయ్ కుటుంబానికి చాలా దగ్గరయింది. దేవరకొండ ఫ్యామిలిలో జరిగే ప్రతి ఫంక్షన్ కు రష్మిక హాజరవుతోంది. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలు దేవరకొండ బ్రదర్స్ తో కలిసి గోవాలో జరుపుకుంది ఈ బ్యూటీ., అలానే ముంబైలో విజ‌య్‌తో క‌లిసి ప‌లుమార్లు క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే ప్ర‌చారం కొద్ది రోజులుగా న‌డుస్తుంది. తాజాగా గాసిప్ రాయుళ్లు ఈ జంట‌కు పెళ్ల‌కి కూడా ఫిక్స్ చేశారు.

Advertisement

వ‌చ్చే ఏడాది లేదంటే ఈ ఏడాది చివ‌ర‌లో విజ‌య్, ర‌ష్మిక పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న‌ట్టు ప్ర‌చారం చేశారు.విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు రాయ‌డంతో, తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్‌లో కాస్త బూతుపురాణంతోనే చిరాకు వ్యక్తం చేశాడు. త​ద్వారా అది ఒక ఫేక్‌ వార్త అని చెబుతూనే.. మీడియాకు చురకలు అంటించాడు.తొలిసారి విజయ్,రష్మికా మందన్న ‘గీత గోవిందం సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్, రష్మిక అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు.’డియర్ కామ్రేడ్ చిత్రంతో మరోసారి కలిసి నటించింది ఈ జంట.

Rashmika Mandanna shares interesting video

Advertisement

Rashmika Mandanna : రష్మికా మందన్న ర‌చ్చ‌..

ఇందులో వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నివేశం కూడా ఉంది. అప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉంది ర‌ష్మిక‌. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తెగ డ్యాన్స్‌లు చేస్తూ చిల్ అవుతుంది. ఈ వీడియోకి కామెంట్ గా.. జ‌నాలు ఎప్పుడు న‌న్ను ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు అని అడుగుతారు. అందుకు నా స‌మాధానం ఇది అంటూ ఓఎమోజీ పెట్టింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి