Home » Entertainment » Rashmika Mandanna Stunning Loooks Viral
Entertainment

Rashmika Mandanna : క‌న్ను కొట్టిన ర‌ష్మిక మందన్నా.. గ‌ల్లంత‌వుతున్న కుర్ర‌కారు హృద‌యాలు

Authored By
Sam C
The Telugu News | Published on: January 16, 2022, 3:00 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక మందన్నా. కెరీర్‌లో ఒక్కో స్టెప్ ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ చివ‌రిగా పుష్ప చిత్రంలో మెరిసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించారు. శ్రీ వ‌ల్లిగా ఆమె అభిన‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసించారు. సినిమా విడుదలై దాపుగా నెల కావొస్తున్నా.. ఇప్పటికీ పుష్పరాజ్, శ్రీ వ‌ల్లి ఫైర్ తగ్గనే లేదు. పుష్ప మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప రెండో భాగంపై ఉంది.

Advertisement

సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక ఇప్పుడు సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా కాస్త గ్యాప్ తీసుకొని చిల్ అవుతుంది. ట్రెడిషనల్ లుక్ లో.. పండగకోసం దర్శనం ఇచ్చింది. అది కూడ కొంటెగా నవ్వుతూ.. కన్నుగీటుతూ..కవ్విస్తూ.. సన్నని స్మైల్ ఇస్తూ.. చంపేస్తుంది రష్మిక. పండగ పూట కూడా కుర్రాళ్ళను వదిలిపెట్టడం లేదు. ఆమె క్యూట్ లుక్స్ చూసి కుర్ర‌కారు గుండెలు గ‌ల్లంత‌వుతున్నాయి. ర‌ష్మిక రోజురోజుకి త‌న ఫ్యాన్ ఫాల‌యింగ్ పెంచుకుంటూ అభిమానుల‌ని ఏదో ర‌కంగా అల‌రిస్తుంది.రష్మిక మందన్న కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అంతేకాదు పెద్దల సమక్షంలో జులై 2017లో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది.

Rashmika Mandanna stunning loooks viral

Advertisement

Rashmika Mandanna : కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా..!

అయితే ఏవో కారణాల వలన ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. ఇక రష్మిక ఎప్పటిలాగే తన సినిమాలతో సూపర్ బిజీగా మారింది. తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా చేస్తున్నారు. దాంతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. టాప్ టక్కర్ అనే ప్రైవేట్ ఆల్బమ్‌తో బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు రష్మిక మందన్న

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి