
Rashmika mandanna : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..ఇలా సినిమా ఇండస్ట్రీ ఎదైనా ఒక హీరో ఒక హీరోయిన్ కలిసి రెండు సినిమాలు చేశారంటే వాళ్ళ మీద రక రకాల వార్తలు పుట్టుకొస్తాయి. ఇక ఒకే ఒక్క సినిమా చేసినా అందులో వాళ్ళ మధ్య బాగా రొమాంటిక్ సీన్స్ ఉన్నా, కొన్ని లిప్ లాక్స్ ఉన్నా సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వీరి మధ్య మంచి రిలేషన్ లేకపోతే ఇలాంటి సీన్స్ ఎలా చేయగలుతారు అని మాట్లాడుకుంటుంటారు. బాలీవుడ్ లో ఇప్పటికే ఇలాంటి రూమర్స్ చాలా మంది జంటల గురించి వచ్చాయి. అయితే తెలుగులో కూడా ఇలాంటి క్రేజీ న్యూస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతున్నాయి.
rashmika-mandanna-vijay devarakonda relationship has come out finally
ఆ స్టార్ కపుల్ మరెవరో కాదు కన్నడ బ్యూటీ రష్మిక మందన్న – రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. రష్మికకి ఇంతకముందే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయి బ్రేకప్ అయింది. అందుకు కారణం రష్మిక కి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చి ఊహించని రేంజ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోవడమే. దాంతో పెళ్ళి చేసుకుంటే ఈ క్రేజ్ రాదన్న కారణంగా రష్మిక తన ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకుంది. పూర్తిగా సినిమాల మీదనే దృష్టి సారించింది. ఇక తెలుగులో ఛలో సినిమాతో పరిచయమయిన రష్మిక మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకొని స్టార్ అయింది. ఇప్పుడు ఈమెకి దాదాపు రెండు కోట్లకి పైగానే రెమ్యునరేషన్ ముట్టచెబుతున్నారట.
కాగా రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారంటూ రిలేషన్ షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాలలో నటించారు. అంతేకాదు ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక కమర్షియల్ యాడ్ ఫిల్మ్ లో కూడా నటించడంతో ఇలా పుకార్లు వస్తున్నాయి. తాజాగా దీనికి స్పందించిన రష్మిక నాకు విజయ్ కి మధ్య కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందని..అంతకు మించి ఏమీ లేదు..మీరు తప్పుగా వార్తలు రాయవద్దంటూ తెలిపింది. ఇక ఇదే సందర్భంలో తనకు సింపుల్ గా ఉండే అబ్బాయిలు ..ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని వాళ్లు నచ్చుతారని వెల్లడించింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.