
Ravanalanka Is Doing Good in Amazon prime
Ravanalanka : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పట్టుదలతో, సినిమా అంటే ప్యాషన్‌తో ఓ నిర్మతగా, హీరోగా తన మార్క్ చూపించారు క్రిష్ బండిపల్లి. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ ‘రావణలంక’ మూవీ విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించిన క్రిష్ బండిపల్లి స్వయంగా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం.సినిమా కథలో స్టఫ్ ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. ఒకప్పటిలా కాకుండా ప్రేక్షకుల ధోరణి, అభిరుచిలో క్రమంగా మార్పు చోటుచేసుకుంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు భారీ ప్రేక్షకాదరణ దక్కుతుండటం చూస్తున్నాం. స్టార్ హీరోలే కాదు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ జనం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
దీనికి తోడు ఓటీటీ వేదికల పరిధి విస్తరించడం అప్‌కమింగ్ హీరోలకు వరంగా మారింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకున్న ‘రావణలంక’ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన తెచ్చుకుంటోంది.క్రిష్ జోడీగా అశ్విత, త్రిష నటించారు. సీనియర్ నటులు మురళి శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 19న 150 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జనవరి 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ ప్రతి రోజు దాదాపు 5 లక్షల వ్యూస్‌తో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో క్రిష్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
Ravanalanka Is Doing Good in Amazon prime
సినిమాల్లో నటించడమే కాదు రిలీజ్ చేసుకునే సత్తా, మార్కెటింగ్ చేసుకునే సామర్ధ్యం ఉన్న వ్యక్తి క్రిష్ బండిపల్లి అని, అతి త్వరలో కెరీర్‌లో గొప్ప మైలురాయిని చేరుకుంటాడని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. అందుకే ముందు ముందు ఆయన మరిన్ని మంచి సినిమాలతో దూసుకుపోతారనేది పలువురు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. ఇప్పటికే క్రిష్‌తో మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేశారు. ఇంత టాలెంట్‌తో పాటు సినిమాల పరంగా గొప్ప గొప్ప విజయాలు సాధించాలనే తపన ఉన్న క్రిష్‌కి పెద్ద డైరెక్టర్స్ ఆఫర్స్ ఇవ్వాలే గానీ స్టార్ స్టేటస్ పట్టేస్తాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.