Home » Entertainment » Relationship Between Ntr And The Girl Who Will Marry Naga Shaurya
Entertainment

Naga Shaurya : నాగ శౌర్య చేసుకోబోయే అమ్మాయికి ఎన్టీఆర్‌కి మ‌ధ్య ఉన్న సంబంధం ఇదేనా?

Authored By
Sam C
The Telugu News | Updated on: November 11, 2022 8:56 am
Advertisement

Naga Shaurya : టాలీవుడ్‌లో ఇటీవ‌ల సెల‌బ్రిటీలు వ‌రుస‌గా పెళ్లి పీట‌లు ఎక్కుతున్న‌విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. న‌వంబర్‌ 20వ తేదీన అతని పెళ్లి బెంగళూరులో జరగనుంది. అతడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనూష. బెంగళూరులోని విటల్‌ మాల్యా రోడ్డులో ఉన్న జేడబ్ల్యూ మారియట్‌ హోటల్లో వీళ్ల పెళ్లి జరగనుంది. నవంబర్‌ 20 ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని ఖరారు చేశారు. న‌వంబర్‌ 19న జరగబోయే మెహందీ వేడుకలతో పెళ్లి సంబరం మొదలుకానుంది.

Advertisement

రెండు రోజుల పాటు కన్నుల పండుగగా వీళ్ల పెళ్లి వేడుక జరగనుండ‌గా, ఇప్ప‌టికే పెళ్లి ప‌నుల్ని మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తుంది. నాగ శౌర్య చేసుకోబోతున్న అనూష శెట్టి ఎవరు? ఇంతకీ వీళ్లది ప్రేమ వివాహామా.. ? పెద్దలు కుదిర్చిన పెళ్లా..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అనే దానిపై జనం కన్ను పడింది. అనూష శెట్టి ట్యాలెంట్ గురించి, ఆమె బ్యాగ్రౌండ్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి ఆమె సర్టిఫికెట్ పొందారు. అంతే కాదు ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

relationship between NTR and the girl who will marry Naga Shaurya

Advertisement

Naga Shaurya : ఇది అస‌లు విష‌యం..!

బెంగుళూరులో ఆమె సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే సంస్థని నడుపుతున్నారు. దానికి ఆమే మ్యానేజింగ్ డైరెక్టర్. 2019లో డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. 2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచారు. ఇలా ఆమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. అనూష శెట్టి స్వస్థలం కర్ణాటకలోని కుందాపూర్. జూ.ఎన్టీఆర్ తల్లి షాలిని స్వస్థలం కూడా అదే కావడం విశేషం. ఆ రకంగా ఎన్టీఆర్‌కి, ఈమెకి చిన్న కనెక్షన్ కుదిరింది. బెంగుళూరులో అనూష, నాగ శౌర్య మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోండ‌గా, ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి