Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?
Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల శివ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దేవర సినిమాలో ఎన్ టీ ఆర్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎన్ టీ ఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శ్రీదేవి తనయురాలైన జాన్వి కపూర్ కేవలం బాలీవుడ్ లోనే కాదు సౌత్ సినిమాల మీద కన్నేసింది. ముందుగా తెలుగు పరిశ్రమలో ఆమె సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. దేవర సినిమా లో నటించినందుకు జాన్వి కపూర్ భారీ రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. దేవర సినిమాలో జాన్వి చేస్తున్న పాత్ర కోసం ఆమె 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందట.
బాలీవుడ్ లో ఆమె ప్రతి సినిమాకు 3, 4 కోట్లు తీసుకుంటుంది. ఐతే దేవరకు వచ్చే సరికి 5 కోట్లు తీసుకుంది. బాలీవుడ్ భామలు సౌత్ సినిమాలు చేయాలంటే వారు మాములుగా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ తీసుకుంటారు. బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి వారు అడిగినంత ఇచ్చేస్తారు మన మేకర్స్. అలా జాన్వి కపూర్ కి 5 కోట్ల దాకా పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది. దేవర సినిమా మీద ఎన్ టీ ఆర్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?
ఐతే దేవర ట్రైలర్ మాత్రం ఆశించిన విధంగా ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్ టీ ఆర్ చేస్తున్న సినిమా కాబట్టి దేవర మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఐతే సినిమా ఏమాత్రం తేడా కొట్టినా సరే కొరటాల శివ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ చేసిన ఈ దేవర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సినిమా హిట్ కొడితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ తో ఎన్టీఆర్ స్టామినా ప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.