Home » Entertainment » Renu Desai About Her Cat Fights
Entertainment

Renu Desai : దాన్ని తన్నేసి నా తల మీదకు ఎక్కేసింది.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 16, 2021, 3:53 pm
Advertisement

Renu Desai  : రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి ఆమె అలవాట్లు ఏంటో తెలిసే ఉంటుంది. వేటిపై ఆమె ప్రేమను చూపుతుందో ఇట్టే తెలుస్తుంది. రేణూ దేశాయ్‌కి పిల్లులంటే ఎంతో ఇష్టం. రేణూ దేశాయ్ ఇంట్లో ప్రస్తుతం ఓ కొత్తఅతిథి వచ్చిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లికి ఓ మంచి పేరు సూచించండని కూడా రేణూ దేశాయ్ కోరింది.

Advertisement

Renu Desai about Her Cat Fights

రేణూదేశాయ్ ఫీబోకు కాంపిటీషన్ పెరిగింది

ఈ క్రమంలో రేణూదేశాయ్ తన కొత్త పిల్లికి ఫ్రాస్టీ అనే పేరును పెట్టింది. ఇక ఈ చిన్న పిల్లికి పెద్ద పిల్లికి రోజూ గొడవలే జరుగుతున్నాయి. పెద్ద పిల్లి ఫీబో చిన్న పిల్లిని కిందా మీదా పడేసి మరీ రక్కేస్తోంది. అలా చిన్ని పిల్లి ఏమీ తక్కువ తిననట్టుగా.. పెద్ద పిల్లిపైపైకి వెళ్లింది. ఇలా ఆ పిల్లుల కొట్లాటను రేణూదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అది బాగానే వైరల్ అయింది. మామూలుగా ఫీబ్ అయితే రేణూదేశాయ్ ఒళ్లోనే ఉంటుంది.

Advertisement

కానీ ఇప్పుడు ఫీబోకు కాంపిటీషన్ పెరిగింది. రెండు పిల్లులు కూడా రేణూదేశాయ్ మీద ఉండేందుకు పోట్లాడినట్టు కనిపిస్తోంది. ఈమేరకు రేణూ దేశాయ్ ఓ ఫోటోను షేర్ చేసింది. ఫీబో, ఫ్రోస్టీ, ఫ్రీడీలు ఇంట్లో చేసే రచ్చను రేణూ దేశాయ్ నిత్యం షేర్ చేస్తూను ఉంటుంది. తాజాగా అలా ఫ్రోస్టీని అవతలకు తన్నేసి అది నా ప్లేస్ అంటూ తన మీదకు వచ్చిందంటూ ఫీబో ఫీస్ట్‌ల అల్లరి గురించి చెప్పుకొచ్చింది.

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి