Home » Entertainment » Renu Desai About Pawan Kalyan And Janasena Support
Entertainment

Renu Desai : పవన్ కల్యాణ్ నా విషయంలో చేసింది తప్పే కానీ.. నా పిల్లల జోలికి రావొద్దు.. రేణూ దేశాయ్

Authored By
aruna
The Telugu News | Published on: August 10, 2023, 6:01 pm
Advertisement

Renu Desai : పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ ఎక్కువగా ఎక్కడా కూడా స్పందించదు. తనను వదిన అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిలిస్తే కూడా వద్దని వారిస్తుంటుంది. విడాకులు అయిన తరువాత ఆ మధ్య ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. పెళ్లాం ఉండగా వేరే అమ్మాయితో బిడ్డని కంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ ట్రోల్ చేసే వారికి తెలుస్తుందా? అన్నట్టుగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ తనను మోసం చేశాడన్నట్టుగానే చెప్పుకొచ్చింది. అయితే ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ గురించి మళ్లీ మాట్లాడింది రేణూ దేశాయ్.

Advertisement

తాజాగా రేణూ దేశాయ్ ఓ వీడియో షేర్ చేసింది. అందులో తన బాధను అంతా కూడా చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తుంటారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లల మీద కూడా పడుతున్నారు. అయితే దీనిపై రేణూదేశాయ్ స్పందించింది. నా మాజీ భర్త రాజకీయాల్లో ఉన్నారు.. ఆయన పిల్లలు కాబట్టి.. వారిని కూడా అందులోకి లాగుతామంటే అది తప్పు.. నా పిల్లలను అందులోకి లాగొద్దు.. నా పిల్లల జోలికి రావొద్దు.. మా పిల్లలు అనే కాదు.. ఎవరి పిల్లలు అయినా కూడా రాజకీయాల్లోకి లాగి విమర్శలు చేయకండి అంటూ వేడుకుంది.

Renu Desai ABout Pawan Kalyan ANd Janasena Support

Advertisement

పవన్ కళ్యాణ్ తన విషయంలో చేసింది తప్పు అని గతంలో చెప్పినట్టు, అది ఇప్పటికీ చెబుతాను అని, పవన్ కళ్యాణ్ తన విషయంలో తప్పు చేశాడని తెలిసింది రేణూ దేశాయ్. అయితే పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయనకు డబ్బే కావాలని అనుకుంటే.. సినిమాల్లోనే ఎక్కువగా సంపాదించేవారు.. నేను ఆయనతో ఉన్న రోజుల్లో కూడా సమాజం గురించి ఎక్కువగా ఆలోచించేవారు.. డబ్బుకు విలువ ఇచ్చే వారు కాదు.. ఆయన పర్సనల్ లైఫ్ కాకుండా.. పొలిటికల్ లైఫ్ మాత్రమే చూడండి.. నేను ఆయనకు పర్సనల్‌గా ఎలా ఉన్నా కూడా రాజకీయంగా మాత్రం ఆయన్ను సపోర్ట్ చేశాను.. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటాను అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి