
Renu Desai : పవన్ కళ్యాణ్ పేరు నా దగ్గర తేవొద్దు.. నాకున్నంత ప్రేమ ఆయనకి లేదన్న రేణూ దేశాయ్..!
Renu Desai : రేణు దేశాయ్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన ఈమెను ఇప్పటికీ అంతా వదినా అనే పిలుస్తున్నారు. తన అభిమాన హీరో భార్యగానే భావిస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. దంపతులుగా రేణు దేశాయ్- పవన్ కల్యాణ్ విడిపోయి వారి జీవితాలను వాళ్లు జీవిస్తున్నారు. కానీ, అభిమానం పేరుతో ఇప్పటికీ రేణూ దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా కామెంట్ సెక్షన్స్ లో నెగిటివ్ కామెంట్స్ తో విసిగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే తాను చాలా మంది అకౌంట్స్ ని బ్లాక్ చేశానంటూ స్వయంగా రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్ తో పోలికలు, తాను చేసిన పనికి క్రెడిట్ ని పవన్ కల్యాణ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ నేరుగా చెప్పారు. కానీ, ఇంకా కొందరు తమ కామెంట్స్ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇటీవలే రేణు దేశాయ్ 3500 కావాలంటూ వీడియో పెట్టగా కొందరు పంపారు. మరికొందరేమో ఆమె అకౌంట్ హ్యాక్ చేశారని, మరికొందరేమో ఆమాత్రం కూడా ఆమె వద్ద లేవా అంటూ కామెంట్లు చేశారు. అయితే వీటన్నిటిపై స్పందిస్తూ.. ఆమె డబ్బులు ఎందుకు అడిగిందో చెప్పింది. తాను ఆ డబ్బులతో జంతువుల కోసం ఓ షెడ్ నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెపై ప్రశంసల వర్షం కురిస్తున్నారు. రేణూ దేశాయ్ చేసే మంచి పనుల్లోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూరి.. ఇదంతా ఆయన క్రెడిట్. ఆయన మంచితనమే అని అంటుంటే.. రేణూ దేశాయ్‌కి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Renu Desai : పవన్ కళ్యాణ్ పేరు నా దగ్గర తేవొద్దు.. నాకున్నంత ప్రేమ ఆయనకి లేదన్న రేణూ దేశాయ్..!
తనకు తోచిన పనులు, తనకు నచ్చిన పనులు చేసుకుంటూ, చేతనైన సాయం చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తుంటే.. మధ్యలోకి వచ్చిన ఇదంతా పవన్ కళ్యాణ్ మంచితనమే అని అంటే.. రేణూ దేశాయ్‌కి మండిపోయినట్టుంది. రేణూ దేశాయ్ ఏదో తన పాటికి తాను బతికేస్తోంది. ఆమె ఏం చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రెడిట్ మాత్రం తమ హీరోకే ఇస్తుంటారు. తాజాగా అలానే ఓ అభిమాని కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి చిర్రెత్తుకొచ్చినట్టుంది. నేను ఏ పోస్ట్ వేసినా సరే కొంత మంది మాత్రం నా మాజీ భర్తను లాగి.. ఆయనతో పోల్చుతుంటారెందుకు? ఎంత మందిని ఎన్ని సార్లు బ్లాక్ చేయాలి.. యానిమల్ రెస్క్యూని గత పదేళ్ల నుంచి నేను చేస్తూనే ఉన్నా.. దానికి నా ఎక్స్ భర్తకు ఎలాంటి సంబంధం లేదు.. ఇకపై అయినా నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి.. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు అని రేణూ దేశాయ్ స్పందించారు
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
This website uses cookies.