Home » Entertainment » Renu Desai Not Attending For Niharika Wedding
Entertainment

Niharika Wedding : దూరంగా రేణూ దేశాయ్ ఫ్యామిలీ.. కార‌ణం అదేనా..?

Authored By
Admin
The Telugu News | Updated on: December 8, 2020, 11:28 am
Advertisement

మెగా ఇంట్లో జరిగే వేడుకలకు రేణూ దేశాయ్ దూరంగా ఉన్న పిల్లలైనా పంపిస్తుంది. అలా మెగా ఇంట్లో జరిగే దీపావళి, సంక్రాంతి ఈవెంట్లకు ఆద్య, అకీరా నందన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. అలాంటి పండుగలకే పంపించే రేణూ దేశాయ్.. నిహారిక పెళ్లికి మాత్రం దూరంగా ఉంచినట్టు కనిపిస్తోంది. నిహారిక పెళ్లి సందర్భంగా అందరూ కూడా ఉదయ్ పూర్‌కు చెక్కేశారు. అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయ్ పూర్ వెళ్లారు. నాగబాబు, చిరంజీవి, అల్లు అరవింద్ ఇలా అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్లారు.

Advertisement

Renu Desai Not Attending For Niharika Wedding

అయితే ఇంకా పవన్ కళ్యాణ్ మాత్రం నిహారిక పెళ్లి ఈవెంట్‌లో పాల్గొనలేదు. ఓ వైపు సినిమా షూటింగ్, మరో వైపు రాజకీయ పర్యటనలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ముహూర్తం సమయానికి పవన్ కళ్యాణ్ వివాహానికి వెళ్లనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా కూడా నిహారిక పెళ్లి ఈవెంట్‌లో కనిపించలేదు. ఆమె కూడా పవన్ కళ్యాణ్‌తో పాటే వెళ్తుందేమో చూడాలి. రేణూ దేశాయ్ మాత్రం అసలు వివాహానికే దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

Renu Desai Not Attending For Niharika Wedding

రేణూ దేశాయ్ నేడు తన ఆద్య మూవీ షూటింగ్‌ను ప్రారంభించింది. ఫుల్ ఎనర్జీతో మొదలెట్టిన ఈ షూటింగ్‌లో బిజీగా ఉంది. దీన్ని బట్టి చూస్తే రేణూ దేశాయ్ పెళ్లికి వెళ్లేలా కనిపించడం లేదు. అయితే అకీరా ఆద్యలు రేణూ దేశాయ్ కచ్చితంగా ఆపదు. కానీ వాళ్లు మాత్రం ఇంత వరకు ఎక్కడా కూడా కనిపించలేదు. తండ్రితో కలిసి వెళ్లారేమో చూడాలి. ఏది ఏమైనా వీరు కూడా పెళ్లి వేడుకల్లో ఉంటే నిండుదనంగా ఉంటుందని అభిమానులు ఆశపడుతున్నారు.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి