Renu Desai : రేణూ దేశాయ్‌ను ఇప్పటికీ జనాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చూస్తుంటారు. కానీ ఆమె ఓ డైరెక్టర్. ఓ నటి.. ఓ క్యాస్టూమ్ డిజైనర్.. రచయిత అనే విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కరోనా కంటే ముందు నుంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రైతు గురించి రేణూ దేశాయ్ ఆలోచిస్తోంది. ఎర్రటి ఎండలో.. నేల రెండుగా చీలి ఉన్న సమయంలోనే షూటింగ్ చేయాలని రేణూ దేశాయ్ అనుకుంటోంది. గత రెండేళ్లుగా ఆ టైంలో లాక్డౌన్, కరోనా అంటూ పరిస్థితులు కుదరడం లేదు. దీంతో తన రైతు ప్రాజెక్ట్‌ను రేణూ దేశాయ్ పక్కన పెట్టేసింది. మొత్తానికి గత కొన్ని రోజులుగా రేణూ దేశాయ్ స్కాట్లాండ్ దేశంలో బాగానే తిరిగి వచ్చింది.
అకీరా నందన్, ఆద్యలతో పాటు రేణూ దేశాయ్ ఓ నెల పాటుగా స్కాట్లాండ్ దేశం అంతా చుట్టి వచ్చినట్టుంది. అకీరా చదువుల కోసం అక్కడికి వెళ్లినట్టు కనిపిస్తోంది. అసలే అకీరా నందన్ తన గ్రాడ్యుయేషన్ కోసం ఏవేవో కలలు కంటున్నాడని రేణూ దేశాయ్ చెబుతుంటుంది. సంగీతంలో మాస్టర్స్ చేయాలని కోరిక ఉందంటూ, బాక్సింగ్, బాస్కెట్ బాల్ ఇలా ఆటల్లోనూ ఆరితేరిపోవాలని ఉందంటూ అకీరా నందన్ తన కోరికల లిస్ట్ చెబుతుంటాడట. ఇక ఇప్పుడు రేణూ దేశాయ్ మాత్రం సెట్స్‌లోకి అడుగు పెట్టేసింది. చాలా ఏళ్ల తరువాత ఇలా ఓ సినిమా కోసం ముందుకు వచ్చింది. రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ ఓపెనింగ్ నాడు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చిరంజీవి, రేణూ దేశాయ్ మాత్రం ముచ్చటించుకోలేదు. ఇక ఈ చిత్రంలో భాగస్వామి అయినందుకు, ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు రేణూ దేశాయ్ థాంక్స్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రేణూ దేశాయ్ ఈ మూవీ సెట్‌లోకి అడుగు పెట్టేసింది. ఎండలు దంచికొడుతున్నాయో ఏమో గానీ సెట్‌లో చాలా మంది గొడుగులు పట్టుకున్నారట. ఈ మేరకు సెట్‌లోని వీడియోను రేణూ దేశాయ్ షేర్ చేస్తూ పోస్ట్ వేసింది. ఇందులో తన లుక్ గానీ, తన ఫోటోగానీ ఎక్కడా బయట పెట్టలేదు.
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
Papaya Leaf Juice : బొప్పాయి పండు గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పండు మనకు చాలా తేలికగా…
This website uses cookies.