Home » Entertainment » Rgv Shares Pawan Kalyan Role In Vyuhaam Movie
Entertainment

RGV : వ్యూహం సినిమాలో నిజంగా పవన్ కళ్యాణ్ బట్టలు విప్పి చూపిస్తా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: August 14, 2023, 10:05 am
Advertisement

RGV : వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అది ఏపీ రాజకీయాలకు సంబంధించిన మూవీ. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ ఏం చేశారు.. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం జరిగింది.. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనే దానిపై ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లను పెడుతున్నారు ఆర్జీవీ.

Advertisement

అయితే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ హైలెట్ అని అంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బట్టలు విప్పి చూపిస్తా.. అంటూ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బట్టలు విప్పడం అనే నిజాన్ని బట్టలు విప్పి చూపించాను అంటూ ఆర్జీవీ చెప్పారు. ఈ సినిమాను కావాలని వైసీపీ వాళ్లు తీయిస్తున్నారా అంటే లేదు.. నా ఇష్టంతో ఈ సినిమా తీశాను అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ.

RGV Shares Pawan Kalyan Role In Vyuhaam Movie

Advertisement

RGV : పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తారా?

భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తారా అంటే లేదు.. అని చెప్పుకొచ్చారు. మరి.. వ్యూహం సినిమా ఎందుకు తీశారు అంటే.. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి రియాల్టీని చూపించడం కోసమే ఈ సినిమాను తీశాను. నేను నమ్మిన నిజాన్ని తీశాను. దానికి ఎలాంటి ఆధారాలు చూపిస్తాను అనేది సినిమాలో చూడాలి. వైసీపీ కోసమో.. మరెవరి కోసమో నేను సినిమా తీయను. నాకు ఎవ్వరూ రూపాయి ఇవ్వలేదు. ఫలానా సినిమా తీయాలని నన్ను ఎవరూ అడగలేదు అంటూ చెప్పుకొచ్చారు ఆర్జీవీ. కాకపోతే నాకు జగన్ అంటే చాలా ఇష్టం. కథ పరంగా నా ఉద్దేశం అదే. జగన్ ని పాజిటివ్ చేయడానికి కాదు.. చంద్రబాబుని నెగెటివ్ చేయడానికి కాదు. నాకు తెలిసింది.. రాజకీయాల్లో జరిగిందాన్ని బట్టి నేను కథ రాసుకొని నా అభిప్రాయాన్నే నేను సినిమాగా తీశాను.. అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి