
RGV tweet about allu arjun and sukumar pushpa movie
Allu Arjun : అల్లు అర్జున్ నిజంగా అదృష్టవంతుడు అనడంలో సందేహం లేదు. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత థియేటర్లు మూత పడ్డాయి. కరోనా వల్ల 2020 మార్చి నుండి పూర్తి స్థాయిలో సినిమా థియేటర్లు మూసి వేయడం జరిగింది. అల వైకుంఠపురంలో సినిమా ఫుల్ రన్ తర్వాత సినిమా థియేటర్ల పై అప్పుడు ఆంక్షలు విధించారు. ఇప్పుడు పుష్ప సినిమా విడుదల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.. సినిమా విడుదల అయ్యి ఫుల్ రన్ తర్వాత థియేటర్ల వద్ద ఆంక్షలు మొదలు అవ్వబోతున్నాయి.పెద్ద ఎత్తున కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో థియేటర్లు మూసి వేసే పరిస్థితి వచ్చింది.
కాని పుష్ప సినిమా ఇంకా ఆ ఎఫెక్ట్ పడలేదు. పైపెచ్చు ఆ ఎఫెక్ట్ తో వసూళ్లు ఎక్కువ వస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు అనుకోవాల్సిందే. ఆ అదృష్టం ఒకెత్తు అయితే ఎంతో మంది స్టార్ హీరోలు పుష్ప సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. సినిమా అద్బుతంగా ఉందని.. సినిమాలో బన్నీ బాబు నటన చాలా బాగుంది అంటూ పెద్ద హీరోలు.. ఫిల్మ్ మేకర్స్ మరియు విశ్లేషకులు కామెంట్స్ చేశారు. ఈ విషయంలో బన్నీ అదృష్టంను కాదనలేం. ఇక వీటన్నింటి కంటే అదృష్టం ఏంటీ అంటే ది గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో కూడా అల్లు అర్జున్ పొగిడించుకున్నాడు.
RGV tweet about allu arjun and sukumar pushpa movie
ఎప్పుడు ఏదో ఒక వివాదంను ముట్టించి వేడి కాచుకునేలా వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ పుష్ప సినిమా గురించి పూర్తి పాజిటివ్ గా మాట్లాడాడు. వర్మ ట్విట్టర్ లో హాయ్ అల్లు అర్జున్ బాలీవుడ్ పెద్ద పెద్ద స్టార్స్ నటించిన అంతిమ్.. సత్యమేవ జయతే 2.. 83 వంటి సినిమాలు వసూళ్లు దక్కించుకునేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో పుష్ప గొప్ప విజయంను దక్కించుకోవడం అభినందనీయం. ఒక ప్రాంతీయ భాష సినిమా ఇలా జాతీయ స్థాయిలో గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడం అభినందనీయం అంటూ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ కు పుష్ప కు గాను ఇంతకు మించిన గొప్ప ప్రశంస ఏమీ ఉండక పోవచ్చు. వర్మ వంటి గొప్ప దర్శకుడు..
పైగా ఆయన ఈమద్య అన్ని కూడా సిల్లీ ట్వీట్స్ వేస్తున్నాడు.అలాంటి వ్యక్తి పుష్ప గురించి పూర్తి పాజిటివ్ గా గొప్పగా ట్వీట్ చేయడం అనేది పుష్ప కు మరియు బన్నీకి దక్కిన అతి పెద్ద ప్రశంసగా చెప్పుకోవచ్చు. ఇంత మంది ప్రశంసలు దక్కించుకున్న బన్నీ నిజంగా అదృష్టవంతుడు అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీలో విడుదల అయిన రెండు వారాల తర్వాత వసూళ్ల జోరు పెరిగింది. అక్కడ మౌత్ టాక్ తో ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ మొత్తం 80 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.