Jabardasth Faima : ఫైమా పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఒకప్పుడు ఎలా కెరీర్‌ను మొదలుపెట్టింది. ఇప్పుడు ఎక్కడి వరకు చేరింది. ఇదే విజయం అంటే. ఆమె కష్టాలకు తగ్గ ప్రతిఫలం దొరికింది. ఇప్పుడు ఫైమా బుల్లితెరపై ఓ బ్రాండ్. పటాస్ షోలో సైడ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చిన ఫైమా ఇప్పుడు జబర్దస్త్ షోకు ప్రాణంగా నిలుస్తోంది. ఆమె చేసేది ఒక్కోసారి అతిగా అనిపించినా కూడా అందులోనూ ఓ మార్క్ వేసేస్తోంది.ఒకప్పుడు ఆమెను ఏ రూపంలో ఉందని ఎగతాళి చేశారో ఇప్పుడు అదే రూపం ఆమెకు కలిసి వచ్చింది.
బక్కగా ఉందని, ఎండిపోయి ఉందని, నల్లగా ఉందంటూ, జుట్టు కూడా లేదని ఇలా ఎన్నెన్నో రకాలుగా సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు అదే ఫైమా జబర్దస్త్ షోలో టాప్ ప్లేస్‌కు వెళ్లిపోయింది. ఫైమా లేకపోతే స్కిట్లే లేదన్నట్టుగా మారిపోయింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ ఇలా అన్ని షోల్లోనూ ఫైమా సందడి చేసింది.తాజాగా చేసిన ఓ స్కిట్‌లో ఫైమా దుమ్ములేపేసింది. పక్కింట్లో రాక్షసి లాంటి ఆడది అద్దెకు దిగితే ఎలా ఉంటుందో ఫైమా చూపించింది.
ఇందులో వర్ష, ఇమాన్యుయేల్‌ను ఫైమా ఆడుకుంది. ఆడోడా? మొగొడివి కాదా? అంటూ ఇమాన్యుయేల్‌ను ఓ ఆట ఆడుకుంది ఫైమా. అయితే ఫైమా దెబ్బకు భాస్కర్, వర్ష, ఇమాన్యుయెల్‌కు చుక్కలు కనిపించి ఉంటాయి.ఈ పర్ఫామెన్స్‌ను చూసి రోజా ఫిదా అయింది. ఫైమాకు బిరుదులు కూడా ఇచ్చేస్తోంది. మాస్ మహారాణి, వన్ ఉమెన్ షో అంటూ ఫైమాను ఆకాశానికెత్తేసింది. ఇక నెటిజన్లు కూడా అదే మాటలు అంటున్నారు. ఫైమా ఉన్నంత వరకు బుల్లెట్ భాస్కర్ టీంకు ఏ ఢోకా లేదని అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.