rrr movie gets trolls
RRR Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ ఏడాది బిగ్గెస్ట్ విజువల్ వండర్లలో ఒకటిగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ సినిమాగా నిలిచింది. 1920స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరు కథానాయికలు భీమ్ గా తారక్.. రామరాజుగా చరణ్ మధ్య స్నేహాన్ని.. బ్రోమాన్స్ ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు.
అయితే వెస్ట్రన్ సినీ ప్రియులు మాత్రం ‘ఆర్.ఆర్. ఆర్’ చిత్రాన్ని ఒక గే సినిమాగా పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. “RRR అనేది ఒక గే (స్వలింగ సంపర్కులు) రొమాన్స్.. రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీని ఎంతగానో ఆస్వాదించాము. ఈ సినిమా స్వలింగసంపర్కుల మధ్య బంధాన్ని చక్కగా వివరించింది” అని ఊహించని రీతిలో ట్వీట్స్ చేస్తున్నారు. “యాక్షన్ – అడ్వెంచర్ – రివేంజ్ డ్రామా అని చెప్పారు. అయితే మీరెవరూ #RRR హృదయపూర్వక స్వలింగ సంపర్కుల సినిమాగా ఎందుకు చెప్పలేదు??” అని ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు.
rrr movie gets trolls
అనేక మంది పాశ్చాత్య దేశాల ప్రేక్షకులు ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని గే డ్రామాగా ప్రొజెక్ట్ చేసేలా ట్వీట్లు పెడుతున్నారు. కరోనా లాక్ డౌన్ లో ఓటీటీలలో గే కంటెంట్ చూసి చూసి.. ఏ సినిమా చూసిన వాళ్లకు అలానే అనిపిస్తోందని కౌంటర్లు వేస్తున్నారు. ఇక మన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా RRR అనేది ఒక గే సినిమా అనే కామెంట్ కు మద్దతు తెలిపారు. “నేను చెప్పింది నిజమే. వారు చాలా స్వలింగ సంపర్కులు. పాశ్చాత్య ప్రేక్షకులు ‘RRR’ ని గే కథగా భావించారు” అని ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీలాంటి వాళ్ళ కారణంగా ఫ్రెండ్ షిప్ కి ఉన్న వాల్యూ కూడా పోతోందని ఫైర్ అవుతున్నారు.
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
This website uses cookies.