RRR Movie sequel plans again
RRR Movie : ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బాహుబలి రికార్డులను చెరిపివేసి తన పేరిట లిఖించుకుంది. రాజమౌళి టేకింగ్, విజన్‌కు యావత్ ప్రపంచ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తారక్, చరణ్‌ల నటనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే యూఎస్, నైజాంలలో బ్రేక్ ఈవెన్‌పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం మరిన్ని రికార్డులు చెరిపేయడం ఖాయంగా కనిపిస్తుంది.ఆర్ఆర్ఆర్ చిత్రం మంచి హిట్ కొట్టడంతో సీక్వెల్‌పై అందరు దృష్టి సారిస్తున్నారు.
ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడొస్తుందో? అసలు వస్తుందా… రాదా! వంటి ఆలోచనల్లో పడ్డారు. ఈ తరుణంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు కథను అందించిన స్టార్ రైటర్.. దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. అదేంటంటే. సీక్వెల్ చర్చలు జరుగుతున్నాయని., రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి ఇంటికి వెళ్లారని, ఆ సమయంలో ఆర్ఆర్ఆర్2 చేయాలనే ఐడియా రావడం,విజయేంద్ర ప్రసాద్ కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగిందట. అన్ని సవ్యంగా కుదిరితే RRR 2 రూపొందే అవకాశం ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు విజయేంద్ర ప్రసాద్.
RRR Movie sequel plans again
రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు హీరోలకు ఉండే ఫ్యాన్స్ బేస్, క్రేజ్, మార్కెట్ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని వారి అభిమానులు సంతోష పడేలా ఏ దర్శకుడు సినిమా చేస్తారా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. అలాంటి తరుణంలోనే దర్శక ధీరుడు రాజమౌళి రంగంలోకి దిగి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో RRR ను అనౌన్స్ చేసి అందరి ఆశ్చర్యపరిచారు. కరోనా కారణంగా సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఏదైతేనేం చివరకు మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. నందమూరి – మెగాభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.