
Rumours About Jagapathi Babu Affair With Soundarya
Soundarya : తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం మరియు అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సౌందర్య. టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు వంటి వారందరితో నటించింది. దీంతో సౌందర్యకు ఆ స్టార్ హీరోలందరితో మంచి స్నేహం ఉండేది. ఇందులో ముఖ్యంగా ప్రముఖ స్టార్ హీరో వెంకటేష్ తో చాలా సన్నిహితంగా ఉండేది.జగపతి బాబు, దివంగత నటి సౌందర్యలది హిట్ పెయిర్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్ని మంచి విజయం సాధించాయి.
దాదాపు తెరపై భార్యభర్తలుగా నటించిన వీరిద్దరిపై అప్పట్లో రూమర్స్ కూడా బాగానే వచ్చేవి. అయితే సౌందర్య పెళ్లి అనంతరం వాటికి చెక్ పడింది. కానీ పెళ్లికి ముందు మాత్రం వీరిద్దరి పెయిర్, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి సౌందర్య, జగపతి బాబు మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ అప్పట్లో అందరూ చెవులు కొరుక్కునేవారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆయన స్పందిస్తూ.. తనకు, సౌందర్యకు మధ్య రిలేషన్ ఉన్నమాట నిజమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మీరు అనుకున్నది కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె అన్యయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్. సౌందర్య వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి.
Rumours About Jagapathi Babu Affair With Soundarya
మేము మాత్రమే కాదు మా ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సమేతంగా హాజరయ్యేవాళ్లం. ఈ క్రమంలో సౌందర్య తరచూ మా ఇంటికి వస్తుండేవారు. నేను వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని. అది చూసి జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సౌందర్య అలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలు నేను కూడా విన్నా. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ ఆయన వివరించారు. సౌందర్య కెరీర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో సౌందర్య విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు.. వెంకటేష్, సౌందర్య నటించిన రాజా, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా ఇలా ఇద్దరూ కలిసి నటించిన ప్రతీ సినిమా హిట్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉన్నదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.