Dil Raju : ఆగస్టు 1వ తారీకున బంద్ అయిన టాలీవుడ్ సినిమా షూటింగ్స్ ఎట్టకేలకు ప్రారంభించేందుకు నిర్ణయించారు. నిర్మాతల గిల్డ్ నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటంతో ప్రముఖ హీరోల సినిమాలు షూటింగ్ నిలిచి పోయాయి. ఆగస్టులో మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ ఈ బంద్ కారణంగా షూటింగ్ నిలిచి పోయిన విషయం తెల్సిందే. దిల్ రాజు తాజాగా మీడియా తో మాట్లాడుతూ తాము డిమాండ్ చేసిన కొన్ని కండీషన్స్ కు ఇండస్ట్రీ వారు ఒప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. అందుకే సెప్టెంబర్ 1 నుండి షూటింగ్ లు పునః ప్రారంభించేందుకు గాను రెడీ అవుతున్నాం అంటూ దిల్ రాజు మీడియా తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
ఈ బంద్ వల్ల జరిగిన లాభం ఏంటీ అంటే నిర్మాతలు చాలా పెద్ద లిస్ట్ చెబుతున్నారు. సినిమా మేకింగ్ కోసం ఖర్చు తగ్గించుకునేందుకు గాను చాలా నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు. అలాగే సినిమా విడుదల అయిన ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఒప్పుకునేది లేదు. ఆ విషయాన్ని సీరియస్ గా అమలు చేయబోతున్నట్లుగా కూడా దిల్ రాజు మరియు ఇతర నిర్మాతలు ప్రకటించారు. ఇక నుండి విడుదల అవ్వబోతున్న సినిమాలు కచ్చితంగా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వాల్సిందే అంటూ టాలీవుడ్ నిర్మాతల కొత్త నిర్ణయం.
ఇక సెప్టెంబర్ 1వ తారీకు నుండి షూటింగ్ లకు నిర్మాతలు సిద్ధం అవుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు.. ప్రభాస్.. పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి, బాలకృష్ణ ఇలా అందరి సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా సెప్టెంబర్ మొదటి వారంలోనే పునః ప్రారంభంకు సిద్ధం అవుతోంది. చిరంజీవి మరియు బాలకృష్ణలు కూడా వారి వారి సినిమాలను పునః ప్రారంభించబతోతున్నారు. అలాగే సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. నెల రోజుల పాటు షూటింగ్ లు లేకపోవడంతో పూర్తి విశ్రాంతి తీసుకున్న స్టార్స్ సెప్టెంబర్ నుండి మళ్లీ మొదలు పెట్టబోతున్నారు.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.