
30 remuneration on movie profits director SS rajamouli range separates
SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తున్నది. వచ్చే ఏడాది జనవరి 7న సినిమా విడుదల కానుంది. కాగా, అప్పుడే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు. ఈ క్రమంలోనే రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో..రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లలో ఎవరికి మీ ఓటు వేస్తారు. ఈ ముగ్గురితో మీరు పని చేశారు… మీ దృష్టిలో ఎవరు బెస్ట్ అని రాజమౌళిని ఒకరు ప్రశ్నించారు. ఈ క్వశ్చన్‌కు రాజమౌళికి ఎటువంటి ఆన్సర్ ఇస్తారని అందరూ ఆసక్తికరంగా ఎదరుచూశారు.
s s rajamouli answered tricky question in a simple manner
కాగా, ఈ క్వశ్చన్‌ను రాజమౌళి తనదైన శైలిలో డీల్ చేసి ఔరా అనిపించుకున్నాడు. ఎవరు బెస్ట్ అనే క్వశ్చన్‌కు డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు రాజమౌళి. ఒక్కొక్క సందర్భంలో తాను ఒక్కొక్క హీరోతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతానని, అలా ముగ్గురు దిబెస్ట్ అని చెప్పకనే చెప్పేశాడు రాజమౌళి. తనకు సినిమా అన్నా.. యాక్టింగ్ అన్నా .. చాలా ఇష్టమని .. ఆ విషయాల గురించి డిస్కస్ చేయాలనుకున్నపుడు తారక్‌తో మాట్లాడుతానని, ఈ క్రమంలోనే జంతువుల గురించి తెలుసుకోవాలన్నా.. జంతువులంటే తనకున్న పిచ్చి గురించి పంచుకోవాలన్నా..
జంతువులు ఎలా ప్రవర్తస్తాయో తెలుపాలన్నా రామ్ చరణ్ తేజ్‌తో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతానని రాజమౌళి తెలిపాడు. ఇక లాస్ట్‌గా తనకు ఫుడ్ అన్నా చాలా ఇష్టమని, అలా ఫుడ్ గురించి మాట్లాడాలకుంటే తాను ప్రభాస్‌తో టైం స్పెండ్ చేస్తానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. మొత్తంగా డిఫికల్ట్ క్వశ్చన్ ను చాలా సింపుల్‌గా డీల్ చేశాడు రాజమౌళి. ఇకపోతే ఫిక్షనల్ స్టోరిగా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోషిస్తుండగా, తెలంగాణ వీరుడు కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. వచ్చే నెల 1న ఈ సినిమాకు సంబంధించిన 45 సెకన్ల గ్లింప్స్ విడుదల కానుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.