sai pallavi and pawan kalyan fans fighting in social media
Sai Pallavi : సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత వయలెంట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఓ రేంజ్ లో వారు రెచ్చి పోయి అవతలి వారిపై విమర్శలు గుప్పించడం చేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది స్టార్ లను కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేసి సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్ లో ఆడేసుకున్న విషయం తెల్సిందే. పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు సాయి పల్లవి పై మరియు ఆమె అభిమానులపై దుమ్మెత్తి పోసే కార్యక్రమంను సోషల్ మీడియా ద్వారా షురూ చేయడం జరిగింది.
ఇటీవల సాయి పల్లవిని ఆమె అభిమానులు కొందరు లేడీ పవర్ స్టార్ అంటూ సంభోదిస్తున్నారు. లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవిని సంభోధించడం ను కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పవర్ స్టార్ అంటే కేవలం మా హీరోనే ఉండాలి.. మా హీరోనే అంతా కూడా పవర్ స్టార్ అనాలి అంటూ ఆమె ను అలా అనకూడదు అంటూ కొన్ని రోజులుగా పవన్ అభిమానుల్లో చర్చ జరుగుతుంది. ఒక సరైన సందర్బం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఆమె విరాటపర్వం విడుదల అయిన వెంటనే ఓ రేంజ్ లో ఆమెను ఏకి పారేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె అభిమానులు లేడీ పవర్ స్టార్ అంటూ చేస్తున్న పోస్ట్ లకు పవన్ అభిమానులు చాలా ఘాటు రిప్లై ఇస్తున్నారు.
sai pallavi and pawan kalyan fans fighting in social media
పవర్ స్టార్ అనే పేరుకు.. పదంకు సాయి పల్లవి అర్హురాలు రాదు. పవర్ స్టార్ సినిమా అంటే సక్సెస్ ప్లాప్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబట్టాలి. కాని సాయి పల్లవి సినిమా విరాట పర్వం విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా వసూళ్లు రాబట్టలేక పోతుంది. అదే పవన్ కళ్యాణ్ సినిమా అయ్యి ఉంటే ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యేవి. కనుక లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవిని అనడం ఇప్పటికైనా మానేయండి అంటూ సాయి పల్లవి అభిమానులను సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
This website uses cookies.