
sai pallavi emotional after recieving saree
Sai Pallavi : రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రం విరాట పర్వం.ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలను మొత్తం సాయి పల్లవి తీసుకుంది. నక్సల్స్ నేపథ్యంలో ప్రేమ, భావోద్వేగాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన విరాటపర్వం జూన్ 17న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ చుసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ చిత్రంలో విప్లవ నేత రవన్నగా రానా నటిస్తుండగా..సాయిపల్లవి సరళ అనే యువతి (నిజ జీవిత పాత్ర) పాత్ర స్పూర్తిగా సాగే వెన్నెల రోల్‌లో నటిస్తోంది.
విరాటపర్వం సినిమా అంతా ఓ అమ్మాయి చుట్టే తిరుగుతుందని, ఆ పాత్రని సాయి పల్లవి అద్భుతంగా పోషించిందని, సాయి పల్లవి ఈ సినిమాకి మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి కోణంలోనే ఈ కథ నడుస్తుందని, ఒరిజినల్ గా జరిగిన కొన్ని పాత్రల నుంచి ఈ కథ రాశానని డైరెక్టర్ వేణు పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ వెళ్లడంతో అక్కడే నివసిస్తున్న ఒరిజినల్ వెన్నెల క్యారెక్టర్ సరళ కుటుంబ సభ్యులను కలిశారు చిత్ర బృందం. సరళ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె అమ్మ నా చేయి పట్టుకొని తన కూతురితో ఎలా మాట్లాడిందో అలానే మాట్లాడింది.
sai pallavi emotional after recieving saree
నన్ను హగ్ చేసుకొని ఎక్కడున్నావ్ బిడ్డ, ఎప్పుడొస్తావ్, ఎందుకు వెళ్లిపోయావ్ అని అనడంతో నేను ఏడుపుని ఆపుకోలేకపోయాను. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సరళ ఫ్యామిలీని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నన్ను ఆశీర్వదించి, బొట్టుపెట్టి, చీరను బహుమతిగా ఇచ్చి పంపించారు. వారిని కలిస్తే.. నా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. సరళ ఫ్యామిలీ మా సినిమా చూసి హ్యాపీగా ఫీలైతే చాలు’అని సాయి పల్లవి అన్నారు. సాయి పల్లవి కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.