Home » Entertainment » Sai Pallavi Fan Comes Up On Stage
Entertainment

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి కోసం వేదిక‌పైకి ఉరికి వ‌చ్చిన అభిమాని.. జ‌డుసుకున్న ముద్దుగుమ్మ‌

Authored By
Sam C
The Telugu News | Updated on: June 13, 2022 7:28 pm
Advertisement

Sai Pallavi : రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం విరాట పర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం (జూన్ 17) ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో వరంగల్‌లో ఆత్మీయ వేడుక అంటూ ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో సాయి పల్లవి మట్లాడుతూ.. ‘వరంగల్‌కి వస్తే నా ఇంటికి వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చినా ఇదే ప్రేమ చూపిస్తుంటారు. శ్యామ్ సింగ రాయ్‌కి వచ్చాను. ఇప్పుడు మళ్లీ వచ్చాను. అంతే ప్రేమ చూపిస్తున్నారు. కళ లేకుండా మనం ఉండలేం.. మనం లేకుండా కళ కూడా ఉండదు. ఇది నిజాయితీతో తీసిన సినమా. నిజాయితీ ఉన్న స్టోరీ. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన వాళ్ల గురించిన కథ.

Advertisement

ఇది మనం ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు. జూన్ 17న రాబోతోంది. అందరూ చూడండి అని చెప్పుకొచ్చింది.ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు వేణుకి థ్యాంక్స్ చెబుతాను.ఆయన ఈ ఊరి నుంచి వచ్చాను. ఈ సినిమా మీకు అంకితం ఇస్తున్నారు. ఈ చిత్రంలో నేను భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉన్నాను. మీ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.. మీ రుణాన్ని నేను ఇలాంటి కథల ద్వారా తీర్చుకుంటాను.మీరు థియేటర్లకు వచ్చి ఆ ప్రేమను తీసుకుంటారని ఆశిస్తున్నాను.అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు. అయితే సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతున్న స‌మయంలో ఓ వ్య‌క్తి ఉరుక్కుంటూ స్టేజ్ పైకి వ‌చ్చాడు. అత‌న్ని చూసి దెబ్బ‌కు జ‌డుసుకుంది.సాధార‌ణంగా హీరోలు మాట్లాడుతున్న స‌మ‌యంలో అలా రావ‌డం మ‌నం చూస్తుంటాం.

sai pallavi fan comes up on stage

Advertisement

Sai Pallavi : అలా భ‌య‌పెట్టాడు..

కాని సాయి ప‌ల్ల‌వి మాట్లాడుతున్న స‌మ‌యంలో ఇలా జ‌ర‌గ‌డం ఆమెకి ఉన్న‌క్రేజ్ తెలియ‌జేస్తుంది. హీరోయిన్ సాయి పల్లవి సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా హాట్ డ్రెస్సుల్లో కనిపించకుండానే సాయి పల్లవి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది. పొట్టి బట్టలు వేసుకోకుండానే అందంగా కనిపిస్తూ కుర్ర హృదయాలు దోచుకుంటోంది. ఇటీవ‌ల పొట్టి బట్టలు తనకు సౌకర్యవంతంగా ఉండవని పేర్కొంది. తనకు పొట్టి బట్టలు ఎందుకు సౌకర్యవంతంగా ఉండవో కూడా సాయి పల్లవి వివరణ ఇచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి