Sai Pallavi : స‌మంత‌లా పొట్టి బట్ట‌లు వేసుకోనంటున్న సాయి ప‌ల్ల‌వి

Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోల‌కి స‌మానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి ప‌ల్ల‌వి. ఏ మాత్రం గ్లామ‌ర్ షో చేయ‌కుండా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి. ఆమె హీరోయిన్‌గా అన్ని రకాల పాత్రలు చేయదు. చాలా సెలక్టీవ్‌గా ఉంటుంది. కంఫ‌ర్ట్ లేక‌పోతే ఎంతటి పెద్ద హీరోతోనైనా చేయదు. `భోళా శంకర్‌`లో చిరంజీవికి చెల్లిగా పాత్రని రిజెక్ట్ చేయడంతోనే సాయిపల్లవి అంటే ఏంటో తెలుస్తుంది. అంతేకాదు ఆమె గ్లామర్‌కి మొదట్నుంచి దూరమే. బలమైన పాత్రల్లోనే నటించేందుకు ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. గ్లామర్‌కి దూరంగా ఉంటుంది.

పొట్టి దుస్తుల్లో తాను కంఫర్ట్ గా ఉండలేనని చెబుతుంది సాయిపల్లవి. తాజాగా ఐటెమ్‌ సాంగ్‌లు చేయడంపై రియాక్ట్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.`రంగస్థలం`లో పూజా హెగ్డేలా `జిగేల్‌ రాణి`, `పుష్ప`లో సమంతలా `ఊ అంటావా మావ.. `వంటి ఐటెమ్‌ సాంగ్‌ల్లో నటించే అవకాశం వస్తే నటిస్తారా? అన్న ప్రశ్నకి సాయిపల్లవి నిర్మొహమాటంగా నో చెప్పింది. అలాంటి పాటల్లో నర్తించడం తనకు కంఫర్ట్ గా ఉండదని చెప్పింది. అలాంటి అవకాశాలు వస్తే, నో చెబుతానని తెలిపింది. మామూలుగా నటించే పాత్రల్లోనే డ్రెస్‌ కంఫర్ట్ గా లేకపోతేనే చాలా ఇబ్బంది ఫీలవుతానని పేర్కొంది. ఐటెమ్‌ సాంగ్‌లు సినిమాల్లో ఒక ప్రత్యేకైన పర్పస్‌ కోసం పెడతారని, నాకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కంఫర్ట్ గా ఉండబోదని తెలిపారు. ఇప్పటి వరకు అలాంటి పాటలు చేయాలనే ఆలోచన రాలేదని తెలిపింది.

sai pallavi gives the clarity

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి తేల్చేసింది..

మొత్తంగా హాట్‌గా కనిపించడం తన వల్ల కాదని చెప్పేసింది సాయిపల్లవి.ప్రేమ గురించి చెబుతూ, ప్రేమ ప్రతి మనిషికి అవసరం అని తెలిపింది. మనిషికి కెరీర్‌ ఎంత ముఖ్యమో, ప్రేమ కూడా అంతే అవసరం అని, ఈ రెండింటిలో ఏది లేకపోయినా లైఫ్‌ ఫుల్‌ ఫిల్‌ కాదని స్పష్టం చేసింది. అయితే ఆ మధ్య సాయిపల్లవిలో ప్రేమలో ఉందని, మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. కానీ అందులో నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. ఇటీవల `లవ్‌ స్టోరీ`, `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రాలతో ఆకట్టుకున్న సాయిపల్లవి త్వరలో `విరాటపర్వం` చిత్రంతో రాబోతుంది. ఇది జులై 1న విడుదల కానుంది. తమిళంలో శివకార్తికేయన్‌తో కమల్‌ హాసన్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తుంది, అలాగే `గార్గి` అనే బైలింగ్వల్‌ చిత్రానికి కమిట్‌ అయ్యింది సాయిపల్లవి.

Recent Posts

Tiffin : మార్నింగ్ టైములో టిఫిన్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…

25 minutes ago

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

9 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

10 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

11 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

12 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

13 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

14 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

15 hours ago