Sai Pallavi : తెలుగులో ‘ ఫిదా ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది సాయి పల్లవి. తన తొలి సినిమాతోనే ఫుల్ పాపులర్ అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని భానుమతి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించింది. హీరో వరుణ్ తేజ్ ను కూడా డామినేట్ చేసేలా నటించి మెప్పించింది. తన నటన, అందం, డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఈ సినిమాతో వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ను తగిలించుకుంది. సాయి పల్లవి చివరిగా నటించిన విరాటపర్వం, గార్గి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో సాయి పల్లవి సినిమాలను మానేసిందని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.
ఎంబిబిఎస్ చదివి డాక్టర్ వృత్తిని చేపట్టిన సాయి పల్లవి ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ తరం హీరోయిన్స్లలో సాయి పల్లవి వేరు అని చెప్పవచ్చు. సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటుంది. ఎక్స్పోజింగ్ వంటి వాటికి చాలా దూరంగా ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఆ సినిమాలో పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటే సాయి పల్లవి చేస్తుంది. లేదంటే నో చెప్పేస్తుంది. ఇక సాయి పల్లవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలోను డాన్స్ ఇరగదీసింది.
ఇక ప్రస్తుతం సాయి పల్లవి కొత్త సినిమాలు గురించి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో సాయి పల్లవి త్వరలోనే సినిమాలను మానేసి, పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే వాటికి చెక్ పెడుతూ అవన్నీ ఫేక్ అని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చేసింది. అయితే రీసెంట్ గా సాయి పల్లవి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసారు. నవ్వులు, ఆశలు, కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ పోస్ట్ చేసింది. హ్యాపీ లైఫ్ కి అవి మూడు ఉంటే చాలు అని పరోక్షంగా చెప్పారు. ఇతర హీరోయిన్స్లలో సాయి పల్లవి వేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.