Sai Pallavi : ఆ రోజుల్లో సాయి పల్లవి డ్యాన్స్ చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు..!
Sai Pallavi : సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. లేడి పవర్ స్టార్‌గా ఆనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఇప్పుడు హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరు. సాయి పల్లవితో డాన్స్ అంటే హీరోలు సైతం క్షణం ఆలోచించాల్సిందే. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు .న్యాచురల్ బ్యూటీగా సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాయి పల్లవికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంటుంది.
Sai Pallavi : ఆ రోజుల్లో సాయి పల్లవి డ్యాన్స్ చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు..!
అప్పుడప్పుడు సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంటాయి. వాటిని చూసి అభిమానులు మైమరచిపోతుంటారు.తాజాగా సాయి పల్లవి కాలేజ్ ఫెస్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. విదేశాల్లో సాయి పల్లవి చదువుకుంటున్న రోజుల్లో వచ్చిన షీలా కీ జవానీ అంటూ స్టెప్పులు వేసింది. ఆమె వేసిన స్టెప్పులు, ఊపేసిన తీరుకు జనాలు ఫిదా అవుతున్నారు. లేడీ మైఖెల్ జాక్సన్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి పల్లవి చిందులకి ప్రతి ఒక్కరు మైమరిచిపోతున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి డ్యాన్స్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తక్కువ మేకప్.. అంతకు మించి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ సహజమైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది సాయి పల్లవి. తొలి చిత్రం తర్వాత తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టినా సాయి పల్లవి నటన ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంది.
Sai Pallavi : ఆ రోజుల్లో సాయి పల్లవి డ్యాన్స్ చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు..!
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో అలరించింది. ‘ప్రేమమ్’ అనే మలయాళం సినిమాతో వెండితెరపైకి వచ్చిన ఈ బ్యూటీ అప్పటి నుండి ఇప్పటివరకు ఏదో సినిమా చేస్తూనే ఉంది. భారీ విజయాలు సాధిస్తూనే ఉంది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కోటగిరి అనే కొండ ప్రాంతంలో పుట్టి పెరిగిన సాయి పల్లవి తన బాల్యాన్ని కోయంబత్తూరులో గడిపింది. సాయి పల్లవి మే 9, 1992న సెంథామరై కన్నన్, రాధ దంపతులకు జన్మించిన విషయం తెలిసిందే.
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
This website uses cookies.