Sakshi Vaidya : పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలి అనే సామెత మాదిరిగా సినిమా ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త అందాలు వస్తేనే ఆడియన్స్‌కు మాంచి కిక్కుంటుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా చూసి చూసి అభిమానులే ఒక్కోసారి బోర్ కొట్టేస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీకి కొత్త సరుకొస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తుంటారు. మన మేకర్స్ కూడా దాదాపు కొత్త అమ్మాయిలను ఇండస్ట్రీకి తీసుకువచ్చేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. కొత్త ప్రాజెక్ట్ గనక ప్లాన్ చేస్తున్నారూ అంటే వెంటనే ముంబై ఫ్లైటెక్కేస్తారు. అక్కడ వందలకొద్దీ మోడల్స్ ఆడిషన్స్ ఇస్తుంటారు. అందుకే, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ చాలా తక్కువగా ఉంటుందని ఓ ఆరోపణ ఉంది.
కొంతవరకూ ఇందులో నిజమూ ఉంది. నార్త్ ఇండియన్స్‌ను, ముంబై మోడల్స్‌ను ఎంకరేజ్ చేసినట్టుగా తెలుగమ్మాయిలను హీరోయిన్‌గా మన సౌత్‌లో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎంకరేజ్ చేయరనే టాక్ ఎప్పుడూ బలంగా వినిపిస్తుంది. ఈ విషయంలో మన తెలుగమ్మాయిలు వాపోయిన సందర్భాలూ ఉన్నాయి. అయినా మన మేకర్స్‌కు వాళ్ల కంఫర్ట్ ముఖ్యం. ప్రధానంగా ముంబై మోడల్స్ అయితే మొదటి సినిమా ఛాన్స్ రావాలంటే రెమ్యునరేషన్ గురించి పట్టించుకోరు.ఓ 5 నుంచి 10 లక్షల లోపు రెమ్యునరేషన్ ఇస్తే సినిమా చేసేయడానికి రెడీ అయిపోతారు. పెద్ద హీరో 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నా కూడా మలయాళ భాష నుంచో మరేదో భాష నుంచో అక్కడ కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నారు. హీరోకి ఇచ్చే 10వ వంతు రెమ్యునరేషన్ కూడా కొత్తగా పరిచయమయ్యే హీరోయిన్‌కు ఉండదు.
అదే నిర్మాతలకు కావాల్సింది. ఇక హీరోయిన్‌గా వచ్చే అమ్మాయికి పెద్ద ఆఫర్ కావాలి. అందుకే కెరీర్ బిగినింగ్‌లో రెమ్యునరేషన్ లాస్ట్ ఆఫ్షన్‌గా మాట్లాడతారు. ఇక అఖిల్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆమె హీరోయిన్ అని ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా మేకర్స్ కన్‌ఫర్మ్ చేయకపోవడంతో అందరిలో కొంత సందేహం ఉండేది. ఇప్పుడు క్లారిటీ ఇస్తూ అఫీషియల్‌గా ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ అని లుక్ రిలీజ్ చేసి ప్రకటించారు. ఈ లుక్ చూసినప్పటి నుంచి అందరి దృష్టి ఆ అమ్మాయి మీదే ఉంది. గూగూల్‌లో ఎవరీ అమాయి అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తను మోడలింగ్ రంగం నుంచే వచ్చింది. ప్రస్తుతం సాషి గురించి నెట్టింట హాట్ టాపిక్ రన్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.