Home » Entertainment » Samantha Act With Mahesh Babu Again In Next Film
Entertainment

Samantha : మహేశ్ బాబుతో మరోసారి జతకట్టబోతున్న సమంత.. కారణం అదేనా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: December 31, 2021, 7:00 pm
Advertisement

Samantha : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సమంత.. ఇద్దరి కాంబోలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో దూకుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దూకుడు సినిమాతో పాటు.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా మహేశ్ బాబు సరసన సమంత నటించింది. బ్రహ్మోత్సవం సినిమాలో కూడా తను మహేశ్ కు హీరోయిన్ గా నటించింది. అంటే.. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు.తాజాగా మరో సినిమాకు ఇద్దరూ కలిసి జతకట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాకు హీరోయిన్ గా ముందు పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ.. పూజాకు డేట్లు సర్దుబాటు కావడం లేదట.పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలో దూసుకుపోతున్న నేపథ్యంలో పూజకు బదులుగా ఆ స్థానంలో సమంతను తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత చాలా సినిమాల్లో నటించింది. అందుకే.. తన హీరోయిన్ సమంతనే ఖాయం చేసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.

samantha act with mahesh babu again in next film

Advertisement

Samantha : పూజా హెగ్డే స్థానంలో సమంతకు చాన్స్

ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ భావించడంతో అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాకు సమంత ఓకే చెబితే.. ముచ్చటగా నాలుగో సారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తవగానే.. విక్రమ్ సినిమాలో నటిస్తాడు.ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా ఉంటుంది. ఇప్పటికే త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. ఇది మూడో సినిమా.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి