Home » Exclusive » Goat Eating Chicken Biryani In Madhya Pradesh Photo Viral
Exclusive

Non Veg Goat : ముక్క లేకుంటే ముద్ద దిగదు.. చికెన్ బిర్యానీ తినే మేకను ఎక్కడైనా చూశారా?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: December 31, 2021 4:47 pm
Advertisement

Non Veg Goat : సాధారణంగా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు గట్రా ఎవరు తింటారు. మామూలు మనుషులు కానీ.. జంతువులు తినవు కదా. నిజానికి ఆ జంతువులను బలి ఇచ్చే కదా మనం చికెన్, మటన్ లు వండుకొని తినేది. కానీ.. ఓ మేక మాత్రం వెరైటీగా చికెన్ బిర్యానీ తింటోంది. ప్రస్తుతం ఆ మేక చికెన్ బిర్యానీ తినే ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

నిజానికి మేకలు చెట్ల ఆకులను, మొక్కలను తిని బతుకుతాయి. కానీ.. ఈ మేక మాత్రం.. ఆకులు తినదు.. మొక్కలను తినదు. చికెన్ బిర్యానీయే. అది లేకుంటే ఈ మేకకు ముద్ద దిగదు. ఈ మేక పేరు భూరి. మధ్యప్రదేశ్ లోని లోహారి గ్రామానికి చెందిన ఓ రైతు మేక ఇది.ఈ మేక ఇప్పుడే కాదు.. పుట్టినప్పటి నుంచి బిర్యానీయే తింటోందట.

goat eating chicken biryani in madhya pradesh

Advertisement

Non Veg Goat : మాంసాహారం అంతే ఈ మేకకు చచ్చేంత ఇష్టం

గత మూడేళ్ల నుంచి ఇది చికెన్, మటన్ తింటుందట. బిర్యానీ లేకపోతే దానికి అస్సలు ముద్ద దిగదట. దీంతో తనకు చికెన్, మటన్ తో పాటు చేపలు, గుడ్డును కూడా పెడుతున్నాడట ఆ రైతు.ఈ వింత మేక గురించి తెలుసుకున్న అక్కడి స్థానికులు మేకను చూసేందుకు ఎగబడుతున్నారట. మేక చికెన్ బిర్యానీ తింటున్న ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి