Samantha and Naga Chaitanya between Twitter war
Samantha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చూడ చక్కని జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. డైవోర్స్ తర్వాత ఎవరి లైఫ్‌ను వాళ్లు లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. విడాకుల వ్యవహారంలో ఎవరిది తప్పు అనే విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ లో ఇన్నాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు రావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే చైతూ పై ఈ రూమర్స్ ప్రచారం చేయడం వెనుక సమంత ఉందని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు.
మాజీ భర్త ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఆమె తన టీమ్ తో కలిసి ఇలాంటి పుకార్లు పుట్టిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య డేటింగ్ రూమర్స్ లో సామ్ హ్యాండ్ ఉందనే నేపథ్యంలో యువ హీరో అభిమానులు ఆమె టీమ్ పై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. అయితే దీనిపై సమంత ట్విట్టర్ వేదికగా స్పందించింది.”అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే. అబ్బాయిపై పుకార్లు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది. ఇకనైనా ఎదగండి అబ్బాయిలు. నిజానికి అందులో ప్రమేయం ఉన్న పార్టీలు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు కూడా మూవ్ ఆన్ అవ్వండి. మీ పని మీద మీ కుటుంబాల మీద దృష్టి పెట్టండి” అని ట్వీట్ చేసింది.
Samantha and Naga Chaitanya between Twitter war
దీనికి వెబ్ సైట్ కథనాన్ని కూడా ట్యాగ్ చేసింది. సామ్ ఈ ట్వీట్ లో ఎక్కడా నాగచైతన్యకు వ్యతిరేకంగా మాట్లాకుండానే.. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఎండగట్టే ప్రయత్నం చేసింది. సమాజంలో అమ్మాయిలపై రూమర్స్ వస్తే ఒకలా.. అబ్బాయిల విషయంలో మరోలా వ్యవహరిస్తారనే విషయాన్ని తెలియజెప్పింది. నాగ చైతన్య త్వరలో ధాంక్యూ మూవీతో పాటు లాల్ సింగ్ చద్దా మూవీలతో పలకరించనున్నాడు. మరోవైపు వెంకట్ ప్రభు దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేయడానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకోవైపు అమెజాన్ ప్రైమ్‌లో ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌తో చైతూ పలకరించనున్నాడు. అయితే ఇరువురు అభిమానులు ఇలా సోషల్ మీడియలో ట్రోల్స్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.