samantha open on her divorce in Naga Chaitanya
Samantha: టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి సమంతలో చాలా మార్పులు చూస్తున్నాం. పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఐటెం సాంగ్స్‌లో నర్తించడం, కవర్ పేజెస్ కోసం బోల్డ్‌గా ఫొటో షూట్స్ వంటివి చేస్తుంది. విడాకుల అనంతరం సినిమాల పరంగా ఇద్దరూ ఫుల్ బిజీ అయ్యారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో నాగ చైతన్య దూసుకుపోతుంటే సమంత వరుస ప్రాజెక్టులకి ఓకే చెప్తుంది. అయితే ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను సామ్ డిలీట్ చేసింది సమంత. కానీ నాగ చైతన్య మాత్రం సమంత ఫోటోలని డిలీట్ చేయలేదు.
రీసెంట్‌గా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో నాగ చైతన్యని అన్‌ఫాలో చేసింది. ఇటు నాగ చైతన్య మాత్రం సమంత ఇన్‌స్టా అకౌంట్‌ను అన్ ఫాలో చేయకుండా ఇంకా ఫాలో అవుతున్నాడు. అంతేకాక చైతన్యను అన్ ఫాలో చేసిన సమంత అక్కినేని ఫ్యామిలిలో నాగార్జున, అమల, అఖిల్.. ఇలా అందర్నీ ఫాలో అవుతుండటం విశేషం. చైతూకి దూరంగా ఉంటున్న సమంత ఆయన ఫ్యామిలీకి మాత్రం దగ్గరగానే ఉంటుంది. టాలీవుడ్ హీరో రానా ఫ్యామిలీతో సమంతకి మంచి అనుబంధం ఉంది. రానా మ్యారేజ్ టైమ్‌లో సమంత కీలకంగా వ్యవహరించింది. మిహికా బజాజ్ తో రానా మ్యారేజ్ విషయంలో సమంత పాత్ర చాలా ఉందనే టాక్ వినిపించింది.
samantha comments on Naga Chaitanya in rana wife
తాజాగా రానా, మిహికాలు ఓ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నారు. ఇందులో బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది మిహికా. ఇది చూసిన సమంత ఫిదా అయ్యింది. `నీ ఔట్‌ఫిట్ నాకు బాగా నచ్చింది` అని పోస్ట్ పెట్టింది సమంత. దీనికి మిహికా స్పందించింది. ధన్యవాదాలు తెలిపింది. మరో ఫోటోకి కూడా సో ప్రెట్టీ అంటూ కామెంట్ పెట్టింది సమంత. ప్రస్తుతం అమ్మడి కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇక సమంత ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన `శాకుంతలం` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మరోవైపు సమంత `యశోద` సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళం, తెలుగులో ఓ బైలింగ్వల్ సినిమా చేస్తుంది. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో నటించబోతుందని టాక్.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.