Mishan Impossible Movie Review : తాప్సీ మిష‌న్ ఇంపాజిబుల్ మూవీ రివ్యూ , రేటింగ్‌..!

Mishan Impossible Movie Review  : తాప్సీ గురించి చెప్పాలంటే.. తను అందరు హీరోయిన్లలా కాదు. తను ఏ సినిమాలో నటించినా.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయాలనుకుంటుంది. రొటీన్ హీరోయిన్ ఫార్ములా కాకుండా.. కొత్తగా ట్రై చేస్తుంటుంది. తెలుగులోనే తను ఎంట్రీ ఇచ్చినా చివరకు బాలీవుడ్ లో స్థిరపడిపోయింది తాప్సీ. ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా.. బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో తాప్సీ నటించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్.

తాప్సీ పెద్ద సినిమా కన్నా… చిన్న సినిమాలనే ఎక్కువగా ఒప్పుకుంటుంది. దానికి కారణం.. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసమే. మరోవైపు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జే నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా ఇవాళ్టి నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. మరి.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో ఉన్న పిల్లల పాత్ర ఏంటి? తాప్సీ పాత్ర ఏంటి? అనే విషయాలు తెలియాలంటే.. సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

Mishan Impossible Movie Review : సినిమా పేరు : మిషన్ ఇంపాజిబుల్

నటీనటులు : తాప్సీ, మాస్టర్ హర్ష్ రోషన్, మాస్టర్ భాను ప్రకాశ్, మాస్టర్ జయతీర్థ మొలుగు, హరీశ్ పరేదీ

డైరెక్టర్ : స్వరూప్ ఆర్ఎస్ జే

ప్రొడ్యూసర్ : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి

బ్యానర్ : మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్

మ్యూజిక్ : మార్క్ రాబిన్

Mishan Impossible Movie Review : కథ ఏంటంటే?

ఈ సినిమాలో ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్ల పేర్లు రఘుపతి(హర్ష్ రోషన్), రాఘవ(భాను ప్రకాశ్), రాజారామ్(జయతీర్థ మొలుగు), ఈ ముగ్గురు చదువుల్లో టాప్. కానీ.. ఆర్జీవీలా గొప్ప డైరెక్టర్ అవ్వాలనేది రఘుపతి కల. కేబీసీ విన్నర్ అవాలనేది రాఘవ కల. క్రికెటర్ అవ్వాలనేది రాజారామ్ కల. వీళ్ల కల నెరవేరాలంటే ఏదో ఒకటి ముందు చేయాలనుకుంటారు. దాని కోసం కరుడుగట్టిన డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవాలని అనుకుంటారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అయిన శైలజ(తాప్సీ) పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే రామ్ శెట్టిని పట్టుకోవడం తెగ ప్రయత్నిస్తుంటుంది. అయితే.. ఆ ముగ్గురు పిల్లలు శైలజకు ఎలా పరిచయం అవుతారు. రామ్ శెట్టిని పట్టుకోవడంలో శైలజకు ఎలా సాయం చేస్తారు అనేదే మిగితా కథ.

Mishan Impossible Movie Review and rating in telugu

Mishan Impossible Movie Review : ఎవరు ఎలా చేశారు?

ముగ్గురు పిల్లలు అయితే చింపేశారు. నటనను అదరగొట్టారు. తాప్సీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కాకపోతే కొన్ని చోట లాజిక్స్ మిస్ అవుతాయి. తనది చాలా లిమిటెడ్ రోల్.

మిగితా నటులు రిషబ్ శెట్టి, సుహాస్, సందీప్ రాజ్, సత్యం రాజేశ్ అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్

ముగ్గురు పిల్లల నటన

మైనస్ పాయింట్స్

వీక్ స్టోరీ

లాజిక్ లేని సీన్లు

బోరింగ్ సీన్లు

కన్ క్లూజన్

మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే.. ప్రస్తుతం థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సినిమా తప్పించి వేరే సినిమాలు లేవు. ఏజెంట్ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. ఆ అంచనాలను డైరెక్టర్ అందుకోలేకపోయాడు. కానీ.. టైమ్ పాస్ కోసం పిల్లల సూపర్బ్ యాక్షన్ కోసం ఒక్కసారి సినిమాను చూడొచ్చు.

ది తెలుగు న్యూస్ రేటింగ్ : 2.25/5

Recent Posts

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

31 minutes ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

2 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

3 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

4 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

5 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

6 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

7 hours ago

Food : మీరు తినే ఫుడ్ ని ఈ విధంగా తీసుకుంటున్నారా… ఇలా తీసుకుంటే బకెట్ తన్నేస్తారు…?

Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…

8 hours ago