Samantha : వెండితెరపై సమంత క్రియేట్ చేస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం సమంత కెరీర్ మీద, డబ్బు మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు చేతిలో ఉన్నాయి. ఇక డబ్బుల కోసం వరుసగా యాడ్స్ చేస్తుంది. ఐటెం సాంగ్స్ కూడా ఒప్పేసుకుంటుంది. యాడ్స్ లో కూడా మరింత రెచ్చిపోయి బికినీలు వేసి మరీ చేస్తుంది. ఇలా యాడ్స్, సినిమాలతో బాగానే డబ్బులు సంపాదిస్తూ మరోవైపు పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెడుతుంది.
ఇక తాజాగా సోషల్ మీడియాలో కూడా ప్రకటనల జోరు పెంచింది. సోషల్ మీడియా నుంచి కూడా బాగానే సంపాదిస్తుంది సమంత. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నాయి. ఈ వరుసలో సమంత ముందున్నది అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ప్రకటనల ద్వారా ఈ భామ నెలకు మూడు కోట్ల వరకు ఆర్జిస్తున్నదని తెలిసింది. ఇటీవలే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల్లో పలు బ్రాండ్‌లకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయి. సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘ఫ్యామిలీమెన్-2’ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంత..ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉంది. వరుస బడా సినిమాలకు సైన్ చేస్తూ..ఇండస్ట్రీ నెం 1 హీరోయిన్ గా కొనసాగుతుంది. సినిమాల పరంగా ఎలా ఉన్నా..వ్యక్తిగతంగా గా ఆమె నెట్టింట ట్రోల్ అవుతూనే ఉంటుంది. మనకు తెలిసిందే..సమంత..టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యామిలీ అయిన అక్కినేని కుటుంబానికి కోడలు వెళ్లింది. ఇద్దరు కలిసి ఏమాయా సినిమా చేశావే మూవీలో ఫస్ట్ టైం నటించారు. ఆ టైంలోనే వాళ్ళ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.