Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని, ప్రతి ఒక్కరు దీనిపై ఆసక్తికర చర్చ జరుపుతున్నారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఒక షోకి చీఫ్ గెస్ట్ గా వెళ్లారని తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి షో స్పాన్సర్ విషయంలో ఒక పేరు తప్పుగా పలికారని, దీంతో మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రీటేక్ చేయమని కోరారని తెలుస్తోంది.
అయితే ఈ విషయంలో కాస్త హర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే షో నుంచి వాకౌట్ చేశారని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షో షూటింగ్ జరుగుతున్న సమయంలో షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి స్పాన్సర్ విషయంలో ఒక పేరు తప్పుగా పలికారని, దీంతో మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రీటేక్ చేయమని కోరగా.. ఈ విషయంలో కాస్త హర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే షో నుంచి వాకౌట్ చేశారని ఫిలింనగర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ షో ఏంటి అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ దాని పేరు గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. ఆయన హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి. అలాగే మరో పక్క వెంకీ కుడుముల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో కూడా ఆయన ఒక సినిమా చేస్తానని ప్రకటించారు. జూన్ 21వ తేదీ నుంచి భోళా శంకర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ లో సినిమా లో భాగమైన దాదాపు అందరూ కనిపిస్తారని తెలుస్తోంది.
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.